ఎన్నో రోజులుగా అభిమానులు వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. RRR మోషన్ పోస్టర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థమైపోతుంది. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే ఈ చిత్రానికి రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ కన్ఫర్మ్ చేసాడు రాజమౌళి. ఇతర భాషల కోసం రైజ్ రోర్ రివోల్ట్ అనేది కన్ఫర్మ్ చేసారు. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేసాడు దర్శక ధీరుడు. మంటల్లోంచి జూనియర్ చరణ్ వస్తుంటే.. నీళ్ళలో నుంచి ఎన్టీఆర్ వచ్చాడు. ఈ ఇద్దరూ చివరికి చేయి చేయి కలిపినపుడు రౌద్రం రణం రుధిరం అని పడుతుంది.
మోషన్ పోస్టర్‌నే టీజర్ రేంజ్లో ప్లాన్ చేసాడు దర్శకుడు. దానికి తోడు కీరవాణి మ్యూజిక్ మరోసారి సినిమాకు హైలైట్ కానుంది. బాలీవుడ్ కాదు హాలీవుడ్ సినిమాల రేంజ్లో దీనికి ఆర్ఆర్ ఇచ్చాడు కీరవాణి. కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది రాజమౌళి. RRR ఇండియా 1920 అని కూడా పోస్టర్లో పెట్టాడు జక్కన్న. అంటే సినిమా అంతా స్వతంత్య్రానికి పూర్వం జరిగిన కథ అని చెప్పేసాడు. జనవరి 8, 2021న విడుదల కానుంది రౌద్రం రణం రుధిరం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: RRR, Telugu Cinema, Tollywood