• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • ROPE CLIMBING 5 YEAR OLD BODY CREATES RECORD IN ROPE CLIMBING BY CLIMBING 14 FEET ROPE IN 23 SECONDS NK GH

Video: ఐదేళ్ల చిచ్చర పిడుగు... 23 సెకన్లలో రికార్డు సృష్టించాడుగా...

Video: ఐదేళ్ల చిచ్చర పిడుగు... 23 సెకన్లలో రికార్డు సృష్టించాడుగా... (image credit - instagram)

Viral Video: పిల్లల్ని సానపెడితే... వారిలో అద్భుతమైన టాలెంట్లు బయటికొస్తాయి. అలాంటి ప్రోత్సాహం వారికి లభించాలి. అప్పుడు అద్భుతాలు చేస్తారు. అందుకు ఆ చిన్నారి బెస్ట్ ఎగ్జాంపుల్.

  • Share this:
Viral Video: ప్రతిభకు వయసు అడ్డురాదనే ఫేమస్​మాట ఇప్పటికే చాలా సార్లు వినిఉంటారు. ఇది ఎన్నోసార్లు రుజువు అయింది. అయితే ఎక్కువ వయసు ఉన్న వారికే ఈ డైలాగ్ వాడతారు. కానీ తక్కువ వయసు ప్రతిభకు ఆటంకం అవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా. అలాంటిదే జరిగింది తమిళనాడులో. 5 సంవత్సరాల వయసు ఉన్న ఓ బుడతడు తాడును క్షణాల్లో ఎక్కేస్తున్నా... ట్రైనింగ్‌తో పాటు, పోటీల్లో పాల్గొనలేని పరిస్థితి అతడిది. అయితే ఆ బాలుడు చేసిన ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేవలం 23 సెకన్లలో ఈ చిన్నారి చెట్టుకు కట్టిన 14 అడుగుల తాడును అలవోకగా ఎక్కి ఆశ్చర్యపరిచాడు. పేరు సాలియావగానన్.​

తమిళనాడు శివగంగై జిల్లా సురాకులమ్ గ్రామానికి చెందిన వినోద్ కుమార్, కర్పగవల్లి దంపతుల రెండో కొడుకు సాలియావగానన్. ఈమధ్య పిల్లలు సరదాగా ఊగేందుకని ఆ తల్లిదండ్రులు చెట్టుకు 14 అడుగుల తాడు ఒకటి కట్టారు. దీంతో అక్కడికి వెళ్లిన సాలియావగానన్​ఒక్కసారిగా ఆ తాడు పైకి పాకేశాడు. దీన్ని తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో మళ్లీ తాడును ఎక్కాలని పిల్లాడిని అడిగారు. దీంతో అతడు మరోసారి 23 సెకన్లలోనే తాడును ఎక్కేసి వారెవా అనిపించాడు.

viral video, Saaliavaganan, Rope Climbing, 5-year old Boy, 14 feet rope in 23 seconds, Sivagangai District, Tamil Nadu, సాలియవగనన్​, రోప్ క్లయింబింగ్​, ఐదు సంవత్సరాల బాలుడు, 14 అడుగులు 23 సెకన్లలో, శివగంగై జిల్లా, తమిళనాడు,
Video: ఐదేళ్ల చిచ్చర పిడుగు... 23 సెకన్లలో రికార్డు సృష్టించాడుగా... (image credit - instagram)


ఈ పిల్లాడు చేసిన ఫీట్‌కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుల్లో ఎక్కే అర్హత కూడా ఉంది. ఓ ఐదేళ్ల బాలుడు 60 సెకన్లలో 20 అడుగుల తాడును ఎక్కడమే ప్రస్తుతం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుల్లో ఉంది. అయితే ప్రస్తుతం సాలియావగానన్ ఏకంగా 14 అడుగుల తాడును 23 సెకన్లలోనే ఎక్కేశాడు. దీంతో చాలా మంది ఈ పిల్లాడిని ప్రశంసిస్తున్నారు. అతడిని మరింత ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.

ఆ వీడియో ఇక్కడ చూడండి.

Video: ఐదేళ్ల చిచ్చర పిడుగు... 23 సెకన్లలో రికార్డు సృష్టించాడుగా...

మరోవైపు తమ కొడుకు టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలని సాలియావగానన్ తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు. అందుకే శివగంగై డిస్ట్రిక్ ట్రైనింగ్ సెంటర్‌కు పిల్లాడిని తీసుకెళ్లి.. ట్రైనింగ్ ఇవ్వాలని కోరారు. అయితే 14 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ట్రైనింగ్ ఇస్తామని అక్కడి వారు చెప్పడంతో వెనుదిరిగారు.

ఇది కూడా చదవండి: Zodiac Signs: ఈ రాశుల వారితో ఇబ్బందే... సీక్రెట్లు చెప్పేస్తారు

మంచి ట్రైనింగ్ ఇస్తే భవిష్యత్తులో రోల్ క్లైంబింగ్‌లో ఉన్నత స్థానాలకు చేరుతాడన్న నమ్మకం తమకు ఉందని సాలియావగానన్ తల్లిదండ్రులు చెబుతున్నారు.
Published by:Krishna Kumar N
First published: