త్రీడీ సర్కస్... ఇక జంతువుల్ని హింసించే పనిలేనట్లే...

3D Circus : సర్కస్‌ జరిగినప్పుడల్లా ఏనుగులు, గుర్రాలు ఇలా ఎన్నో జంతువులు చేసే విన్యాసాలు ఇకపై త్రీడీ టెక్నాలజీతో హోలోగ్రామ్స్ ద్వారా చూడొచ్చు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 7, 2019, 10:06 AM IST
త్రీడీ సర్కస్... ఇక జంతువుల్ని హింసించే పనిలేనట్లే...
త్రీడీ సర్కస్ చూసితీరాల్సిందే (Image : Youtube / Optoma EMEA
Krishna Kumar N | news18-telugu
Updated: June 7, 2019, 10:06 AM IST
సర్కస్ అంటేనే బఫూన్లతోపాటూ... సింహాలు, పులులు, ఏనుగులు, కోతులూ ఇలా ఎన్నో జంతువుల విన్యాసాల సమ్మేళనం. ఐతే... సర్కస్ పేరుతో జంతువుల్ని హింసిస్తున్నారంటూ... జంతు ప్రేమికులు ఆందోళనలు చేస్తుండటంతో... ఇటీవల సర్కస్‌లలో జంతువుల వాడకం బాగా తగ్గింది. ఇంకా చెప్పాలంటే అసలు సర్కస్‌లే మూతపడే పరిస్థితి వచ్చేసింది. నెదెర్లాండ్స్, ఐర్లాండ్, మెక్సికో లాంటి దేశాలు... సర్కస్‌లో జంతువుల వాడకాన్ని నిషేధించాయి. తాజాగా జర్మనీలో సరికొత్త సర్కస్ తెరపైకి వచ్చింది. రోనాకల్లీగా పిలిచే ఈ సర్కస్‌లో త్రీడీ హోలోగ్రామ్ టెక్నాలజీతో జంతువుల్ని, పక్షుల్నీ ఇలా ఏవి కావాలంటే వాటిని చూపిస్తూ అందర్నీ అలరిస్తున్నారు.

ప్రపంచంలో త్రీడీ హోలోగ్రామ్‌తో ప్రదర్శిస్తున్న తొలి సర్కస్ ఇదే. బ్లూబాక్స్, ఆప్టోమా సంస్థలు... ఈ సర్కస్‌కి త్రీడీ హోలోగ్రామ్ ప్రొజెక్షన్లను సమకూర్చాయి. త్రీడీలో వస్తున్నా, ఒరిజినల్ సర్కస్ చూసినట్లే అనిపిస్తుందని ప్రేక్షకులు చెబుతున్నారు.


కాలక్రమంలో కనుమరుగవుతున్న సర్కస్‌ను నిలబెట్టుకోవడానికి త్రీడీ టెక్నాలజీ చక్కగా ఉపయోగపడుతుందంటున్నారు రోనాకల్లీ నిర్వాహకులు. 1976 నుంచీ ఈ సర్కస్ కొనసాగుతోంది. తాజాగా నిర్వాహకులు జంతువుల వాడకాన్ని నిలిపేశారు. ఒరిజినల్ జంతువులు చెయ్యలేని ఎన్నో ట్రిక్స్... త్రీడీలో చెయ్యడానికి వీలవుతోందని వారు చెబుతున్నారు.

First published: June 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...