ఆ ఘనత సాధించిన భారత మూడో క్రికెటర్ రోహిత్ శర్మ

ICC Men’s Cricket Awards | గత ఏడాది వన్డేలో అద్భుతమైన ప్రతిభను చూపిన భారత ఓపనర్ రోహిత్ శర్మ...ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

news18-telugu
Updated: January 15, 2020, 1:16 PM IST
ఆ ఘనత సాధించిన భారత మూడో క్రికెటర్ రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (File)
  • Share this:
గత ఏడాది వన్డేలో అద్భుతంగా రాణించిన భారత ఓపనర్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. ‘ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును హిట్ మ్యాన్ దక్కించుకున్నాడు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీల తర్వాత ఈ అవార్డును సాధించిన భారత మూడో ఆటగాడు రోహిత్ శర్మ కావడం విశేషం. ఈ మేరకు వార్షిక అవార్డుల విజేతల జాబితాను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. గత ఏడాది రోహిత్ శర్మ 28 మ్యాచ్‌లలో 1,409 పరుగులు సాధించాడు. ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కడం పట్ల రోహిత్ శర్మ సంతోషం వ్యక్తంచేశాడు. 2019లో జట్టు కోసం తాను రాణించడం సంతోషాన్ని ఇచ్చిందన్నాడు.

కాగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్ట్, వన్డే కెప్టెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులతో పాటు ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఒవల్ మైదానంలో క్రీజు దగ్గర స్టీవ్ స్మిత్‌కు ఇబ్బంది కలిగిస్తున్న భారత అభిమానులను అడ్డుకుని..క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినందుకు కోహ్లీ ఈ అవార్డు సాధించాడు.మరో భారత ఆటగాడు దీపక్ చహర్ టీ20 ఫర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చహర్ కేవలం ఆరు పరుగులిచ్చి ఏడు వికెట్లు సాధించాడు.ఐసీసీ ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండగా...ఓపనర్ రోహిత్ శర్మ, మొహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. టెస్ట్ జట్టుకు సైతం కోహ్లీ కెప్టెన్‌గా ఉండగా...మయాంక్ అగర్వాల్ చోటు దక్కించుకున్నాడు.అటు ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమ్మిన్స్ ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలిచాడు. కమ్మిన్స్ టెస్ట్ మ్యాచ్‌లలో గత ఏడాది 59 వికెట్లు సాధించాడు. ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఐసీసీ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలిచాడు.రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ 2019 సంవత్సరానికి ఐసీసీ ఉత్తమ అంపైర్‌గా డేవిడ్ షెఫెర్డ్ ట్రోఫీ గెలుచుకున్నాడు.

First published: January 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు