రోహిత్.. క్రమశిక్షణ తప్పావ్..  మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత..

రోహిత్.. క్రమశిక్షణ తప్పావ్..  మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత..

ట్విట్టర్ ఫోటో

కోల్‌కతా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వేలెత్తాడు. తాను ఔట్ కాలేదంటూ రోహిత్ సమీక్ష కోరాడు. డీఆర్ఎస్‌లో బంతి వికెట్లను తాకినట్లు కనిపించింది.

 • Share this:
  ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్ శర్మకు జరిమానా పడింది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బెయిల్స్‌ను బ్యాటుతో పడగొట్టి, ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు.. క్రమశిక్షణ తప్పాడని, అతడి మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటైన రోహిత్.. పెవిలియన్‌కు వెళ్తూ బెయిల్స్ పడగొట్టి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.  ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 2 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే ఓపెనర్ డికాక్‌(0)ను కోల్పోయింది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 9 బంతుల్లో 12 పరుగులే చేసి గర్నీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. గర్నీ విసిరిన ఫుల్‌ లెంగ్త్ బంతిని రోహిత్ శర్మ హిట్ చేయబోగా అది బ్యాట్‌కి తాకకుండా వెళ్లి ప్యాడ్స్‌ను తాకింది. దీంతో, కోల్‌కతా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వేలెత్తాడు. తాను ఔట్ కాలేదంటూ రోహిత్ సమీక్ష కోరాడు. డీఆర్ఎస్‌లో బంతి వికెట్లను తాకినట్లు కనిపించింది. దీంతో అంపైర్ తన మునుపటి నిర్ణయానికే కట్టుబడగా.. రోహిత్ శర్మ పెవిలియన్‌కి పయనమయ్యాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని వికెట్లపై ఉన్న బెయిల్స్‌ను బ్యాట్‌తో పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై 34 పరుగుల తేడాతో ఓడిపోయింది.
  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  అగ్ర కథనాలు