రాళ్ల లాంటి గుడ్లు... ఇటుక లాంటి జ్యూస్... సియాచిన్‌లో ఇండియన్ ఆర్మీ సెన్సేషనల్ వీడియో

Siachen Glacier : మైనస్ 40 నుంచీ మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతల జీవించడం ఎంత కష్టమో చెబుతూ... కళ్లారా చూపిస్తూ... ఇండియన్ ఆర్మీ ఈ వీడియోను రూపొందించింది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 9, 2019, 9:35 AM IST
రాళ్ల లాంటి గుడ్లు... ఇటుక లాంటి జ్యూస్... సియాచిన్‌లో ఇండియన్ ఆర్మీ సెన్సేషనల్ వీడియో
సియాచిన్‌లో ఇండియన్ ఆర్మీ (Image : Twitter)
  • Share this:
ప్రపంచంలోనే అతి ఎత్తైన సైనిక గస్తీ ప్రాంత సియాచిన్ గ్లేసియర్. అక్కడ ఇండియన్ ఆర్మీ నిరంతరం పహారా కాస్తూ ఉంటుంది. ఐతే... ఆ మంచు పర్వతాల్లో శత్రువులతో కంటే... మంచుతోనే అతి పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. తాగే నీటితోపాటూ... ఏది తినాలన్నా గడ్డకట్టే ఉంటాయి. ఎంత దారుణమంటే... సుత్తితో పగలగొట్టినా పగలనంత గట్టిగా ఉంటాయి. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో వివరిస్తూ... ఓ జవాన్... ట్విట్టర్‌లో వీడియోని పోస్ట్ చేశారు. సియాచిన్ గ్లేసియర్‌లో జీవించడం ఎంత కష్టమో ఈ వీడియోని చూస్తే అర్థమైపోతుంది. ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్‌లో జ్యూస్ ఇటుకలా గడ్డకట్టి ఉన్నాయి. ఆ జ్యూస్ తాగాలంటే దాన్ని వేడి చెయ్యాల్సిందే. దుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు కోడిగుడ్లు, అల్లం... ఇలా అన్నీ రాళ్లలాగా గట్టిగా ఉంటాయని వివరించారు సైనికులు.సియాచిన్‌లో దుంపనే తీసుకుంటే, దాన్ని కత్తితో కొయ్యలేం. ముందుగా సుత్తితో పగలగొట్టాలి. అది అంత తేలిక కాదు. పగలగొట్టేటప్పుడు ఆ దుంప ముక్కలై, చెల్లా చెదురుగా ఎగిరిపోతుంది. గుడ్లు, అల్లం, ఉల్లిపాయలు ఇలా ఏది పగలగొట్టాలన్నా ఓ యుద్ధం చేసినట్లే. ఇంత దారుణమైన పరిస్థితుల్లో తాము పహారా కాస్తున్నామని తెలిపారు సైనికులు. మైనస్ 40 నుంచీ మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో దేశం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికులు పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది.

జూన్ 3న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సియాచిన్‌ బేస్ క్యాంప్‌కి వెళ్లారు. ఆ తర్వాత ఈ వీడియో రిలీజైంది.ఇవి కూడా చదవండి :

చికెన్ ధరల మోత... భారీగా పెంపు... మాంస ప్రియులకు నిరాశ...


షుగర్ ఫ్రీ మామిడి పండ్లు... డయాబెటిక్ పేషెంట్లకు పండగే...

రోజా, అంబటికి నామినేటెడ్ పదవులు... సీఎం జగన్ ఆలోచన ఇదేనా?
Published by: Krishna Kumar N
First published: June 9, 2019, 9:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading