rRobot To School : ఇప్పుడు రోబోలు కూడా స్కూల్ కి వెళ్లడం ప్రారంభించాయి. రోబో ఏంటీ.. స్కూల్ కి వెళ్లడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అవును ఇది నిజమే. పిల్లల మాదిరిగానే ప్రతి రోజూ స్కూల్ కి వెళ్లి శ్రద్దగా టీచర్లు చెప్పే పాఠాలు వినడమే కాకుండా మధ్యలో తనకు వచ్చిన సందేహాల గురించి కూడా టీచర్లను అడిగి తెలుసుకుంటోంది ఓ రోబో(Robot Attends Schools). అయితే ఇంతకి ఆ రోబో ఎక్కడ స్కూల్ కి వెళుతోంది? ఎందుకు స్కూల్ కి వెళ్లాల్సి వచ్చిందో చూద్దాం. జర్మనీ రాజధాని బెర్లిన్ లో నివసించే జోషువా మార్టినాన్ గెల్లి అనే ఏడేళ్ల బాలుడు అనారోగ్య కారణాలతో స్కూలుకు వెళ్లలేకపోతున్నాడు. జోషువాకి ఊపిరితిత్తుల్లో సమస్య ఉంది. దీంతో అతడి ఊపిరితిత్తులకి ఓ ట్యూబ్ అమర్చి... దాన్ని అతడి మెడకు సెట్ చేశారు డాక్టర్లు. అందువల్ల జోషువా స్కూలుకు వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.
అయితే కరోనా కారణంగా పిల్లలు స్కూలుకు వెళ్లలేనప్పుడు..వాళ్ళ స్థానంలో రోబోలను పంపితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓ ప్రైవేట్ సంస్థ ప్రయోగం చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో జోషువా మార్టినాన్ గెల్లి గురుంచి సదరు సంస్థకి తెలిసింది. దీంతో ఆ పిల్లాడి బదులు "అవతార్(Avatar Robot)"అనే పేరు గల ఓ రోబోని ఆ పిల్లవాడు చదివే "పుస్టేబ్లూమ్-గ్రుండ్స్చూల్" స్కూల్ కి పంపుతూ తమ ప్రయోగాత్మక ప్రాజెక్టుని పట్టాలెక్కించింది. ఈ ప్రాజెక్టు కి బెర్లిన్ జిల్లా "మార్జాన్-హెల్లెర్స్డోర్ఫ్" స్థానిక కౌన్సిల్ నిధులు సమకూర్చింది.
జోషువాకి బదులుగా "అవతార్" రోబో రోజూ స్కూలుకి వెళ్తోంది. స్కూల్లో ఆ చిన్నారి కూర్చునే టేబుల్ దగ్గరే ఈ రోబో ఉంటుంది. ఆన్ లైన్ క్లాసులలో మాదిరిగా స్కూల్ లో టీచర్లు పాఠాలు చెబుతున్నప్పుడు ఆ రోబో వీడియో లైవ్ రికార్డ్ చేస్తుండగా ... ఇంట్లో ఉంటున్న పిల్లాడు రోబో ద్వారా ఆన్ లైన్ క్లాసులను తన ల్యాప్ టాప్ లో చూస్తున్నాడు. టీచర్లతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఏదైనా డౌట్ వస్తే రోబో ద్వారా టీచర్లను అడిగిస్తున్నాడు. అలా ఇంటి నుంచే పాఠాలన్నీ నేర్చేసుకుంటున్నాడు . ఇక స్కూల్ కి వస్తోన్న రోబోని చూసి మిగతా విద్యార్థులు ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో. దాన్ని చూసి ఆనందపడుతూ సెల్ఫీలు తీసుకుంటున్నారు.
ALSO READ Robots: ఈ రోబో నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పేస్తుంది.. శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
పుస్టేబ్లూమ్-గ్రుండ్స్చూల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఉటే వింటర్బర్గ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.."ఈ రోబో పిల్లలతో మాట్లాడుతోంది. జోక్స్ వేస్తోంది. నవ్వుతోంది. కొన్నిసార్లు క్లాస్ జ రుగుతున్నప్పుడు కూడా ఆసక్తికరమైన అంశాలపై చిట్ చాట్ చేస్తోంది. దీనివల్ల జోషువా బాగా చదువుకోగలుగుతున్నాడు"అని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Online classes, Robot