Home /News /trending /

ROBBERY AT A GROCERY STORE IN BIHAR THIEVES WHO SHOT DEAD A SHOPKEEPER SNR

Bihar: ఆ దోపిడీ దొంగలు ఎంతటి కిరాతకులో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Viral video: బిహార్‌లో దొంగల దోపిడీ పెరిగిపోయింది. ఓ కిరాణాషాపులో చొరబడ్డ ఇద్దరు దొంగలు తుపాకులతో కాల్పులు జరిపి అందర్ని భయపెట్టారు. షాపులో చొరబడి 30వేల నగదు ఎత్తుకెళ్లారు. దోపిడీ దొంగలు సృష్టించిన బీభత్సంలో ఒకరు చనిపోగా..మరొకరి కండీషన్ సీరియస్‌గా ఉంది. తుపాకులతో కాల్చి చంపుతున్న వీడియో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...
బీహార్‌(Bihar)లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. డబ్బుల కోసం ఓ సూపర్‌ మార్కెట్‌లోకి చొరబడి చేసిన హింసాకాండ షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. ఛప్రా (Chapra)జిల్లాలోని అమ్మూర్‌ (Ammur)పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని షేక్‌పూరా సూపర్‌ మార్కెట్‌ సముదాయంలో ఉంది ఓ కిరాణాషాపు. అక్కడికి బైకుపై వచ్చిన ఇద్దరు దొంగలు దర్జాగా కస్టమర్ల స్టైల్లో షాపులోకి చొరబడ్డారు.  బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు పిస్టోల్స్(Pistol) పట్టుకొని షాపు లోపలకి వెళ్లారు. షాపు ఓనర్‌ని డబ్బులు ఇవ్వమని తుపాకి గురిపెట్టి చూపిస్తూ డిమాండ్ చేశారు. షాపు యజమాని ఎవరు మీరు అని అడుగుతుండగానే తుపాకీ (Gun)పేలుస్తూ బూతులు తిట్టారు. కౌంటర్‌లో ఉన్న డబ్బులన్నీ ఇవ్వమని బెదిరించారు. దుండగులు షాపులో చొరబడిన సమయంలో అక్కడే పని చేస్తున్న పనివాళ్లలో  అమిత్‌కుమార్ ప్రసాద్(Amit Kumar Prasad) అనే వ్యక్తి దొంగలకు ఎదురుచెప్పే ప్రయత్నం చేయబోయాడు. అంతలోనే ఓ దొంగ తుపాకీ పేల్చడంతో బుల్లెట్ తగిలి షాప్ కీపర్ అమిత్‌కుమార్ ప్రసాద్ చనిపోయాడు. షాపులో పనిచేస్తున్న వాళ్లంతా ఆ భయంతో వెంటనే షాపు వెనుకభాగం వైపు పారిపోయారు. వెంటనే  దొంగలిద్దరూ కౌంటర్‌లో వైపు దూకి అందులో ఉన్న డబ్బులను మూటగట్టి తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రి సమయంలో ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

దడ పుట్టించిన దొంగలు..
మార్కెట్‌లో ఉన్న మరికొందరు వర్తకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన స్పాట్‌కి చేరుకున్నారు. దుండగుల కాల్పుల్లో అమిత్‌కుమార్ ప్రసాద్ అనే షాప్ కీపర్ చనిపోగా..దియా అనే మరొకరు గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉండటంతో పాట్నా ఆసుపత్రికి తరలించారు. దోపిడీ దొంగలు షాపులో చొరబడి మొత్తం 30వేల రూపాయల క్యాష్‌ ఎత్తుకెళ్లినట్లుగా పోలీసుల దర్యాప్తులో రాబట్టారు. సీసీ ఫుటేజ్‌ సేకరించారు. అందులో దొంగల ముఖాలను గుర్తు పట్టి పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.

తుపాకీ తూటాలు..
చాప్రాలో ఈతరహా దోపిడీలు, నేరాలు ఈమధ్య కాలంలో బాగా పెరిగినట్లుగా పోలీసులు తెలిపారు. ముఖ్యంగా దారి దోపిడీ దృశ్యాలు చూస్తుంటే కరడుగట్టిన నేరస్తులే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే ప్రాంతంలో గత కొద్ది రోజులుగా వరుసగా నేరాలు జరుగుతుంటడంతో స్థానికులు కూడా భయపడిపోతున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Bihar News, Crime news, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు