మనసున్న మంచి దొంగ.. కొట్టేసిన డబ్బులు వెనక్కి ఇచ్చేశాడు

లీ అనే యువతి డబ్బులు డ్రా చేసేందుకు స్థానికంగా ఉన్న ఏటీఎంకు వెళ్లింది. ఆమె డబ్బులు తీసుకుంటుండగా ఓ దొంగ ఏటీఎంలోకి చొరడబ్బాడు. యువతిని కత్తితో బెదిరించాడు.

news18-telugu
Updated: March 13, 2019, 3:39 PM IST
మనసున్న మంచి దొంగ.. కొట్టేసిన డబ్బులు వెనక్కి ఇచ్చేశాడు
ఏటీఎంలో యువతికి డబ్బులు తిరిగి ఇచ్చేసిన దొంగ
news18-telugu
Updated: March 13, 2019, 3:39 PM IST
ఈ మధ్యకాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. చెవికమ్మల కోసం చిన్నారుల్ని... మెడలో గొలుసుల కోసం పెద్దవారిని చంపేసి వారి వాటిని ఎత్తుకెళ్తున్నారు. ఇంకొందరు ఇళ్లను గుళ్ల చేస్తున్నారు. మరికొందరు బెదిరించి జనం దగ్గరున్మ సొమ్మును, నగల్ని ఎత్తుకెళ్తారు. కానీ .... ఓ దొంగ అలాంటేవేమి చేయలేదు. ఏటీఎంలో ఓ మహిళ వద్ద బెదిరించి డబ్బులు తీసుకున్న అతడు... ఆమె పరిస్థితి చూసి తిరిగి వాటిని వెనక్కి ఇచ్చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిధా అయిపోతున్నారు. చైనా దేశంలోని హేయువాన్ అనే నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగరానికి చెందిన లీ అనే యువతి డబ్బులు డ్రా చేసేందుకు స్థానికంగా ఉన్న ఏటీఎంకు వెళ్లింది. ఆమె డబ్బులు తీసుకుంటుండగా ఓ దొంగ ఏటీఎంలోకి చొరడబ్బాడు. యువతిని కత్తితో బెదిరించాడు. డ్రా చేసిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆ అమ్మాయి భయపడిపోయి... విత్ డ్రా చేసిన డబ్బంతా దొంగకు ఇచ్చేసింది.

దీంతో ఎకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేయాలని దొంగ డిమాండ్ చేశాడు. ఆమె బెదిరిపోయి... అతను చెప్పినట్లుగానే ఎకౌంట్ చెక్ చేసింది. బ్యాంక్ బ్యాలెన్స్‌లో డబ్బులు లేవని తెలియడంతో లీ పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అంతే కాదు... ఆమె వద్ద తీసుకున్న సొమ్మంతా తిరిగి ఇచ్చేశాడు. ఈ దృశ్యాలు ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫుటేజ్‌ ప్రకారం ఈ సంఘటన ఫిబ్రవరిలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. డబ్బు తీసుకోకపోయినప్పటికీ అతను చేసింది తప్పే కాబట్టి స్థానిక పోలీసులు ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కూడా ఆ దొంగ మంచితనాన్ని మెచ్చుకున్నారు. ఇంత మంచి దొంగను శిక్షించడం ఎందుకు? అంటూ నెటిజన్లు కూడా అతనికి మద్దతు పలుకుతున్నారు.First published: March 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...