హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

McDonalds Fun Robbery: దొంగతనానికి వెళ్లి.. ఫుడ్ కోసం బెదిరించాడు... ఆ తరువాత ఏమైందంటే...

McDonalds Fun Robbery: దొంగతనానికి వెళ్లి.. ఫుడ్ కోసం బెదిరించాడు... ఆ తరువాత ఏమైందంటే...

ఇంగ్లాండ్‌లోని ఒక మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో చోటుచేసుకుంది. ఇక్కడికి ఉదయం షాపు తెరవగానే ఒక వ్యక్తి మాస్క్‌ పెట్టుకొని వచ్చాడు. కౌంటర్‌ దగ్గరకు వచ్చి గన్‌ పట్టుకొని బెదిరించాడు. గల్లా పెట్టెలో ఉన్న డబ్బులు తీసుకున్నాడు. ఆ తరువాత ఎవరైనా అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ ఆ దొంగ మాత్రం.. ఆకలేస్తోంది తినడానికి చికెన్‌ నగెట్స్‌ బాక్స్‌ ఇవ్వమని అడిగాడు.

ఇంకా చదవండి ...

  హోటల్‌లో దొంగతనానికి వెళ్లిన వ్యక్తి, ఆహారం కోసం సిబ్బందిని బెదిరించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. హోటల్‌లో దోపిడీకి వచ్చి ఆహారం కోసం బేరసారాలు చేశాడు ఒక దొంగ. డబ్బు దోచుకొని పోయేముందు.. చికెన్ నగ్గెట్స్ కావాలని నిర్వాహకులను బెదిరించాడు. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని ఒక మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో చోటుచేసుకుంది. ఇక్కడికి ఉదయం షాపు తెరవగానే ఒక వ్యక్తి మాస్క్‌ పెట్టుకొని వచ్చాడు. కౌంటర్‌ దగ్గరకు వచ్చి గన్‌ పట్టుకొని బెదిరించాడు. గల్లా పెట్టెలో ఉన్న డబ్బులు తీసుకున్నాడు. ఆ తరువాత ఎవరైనా అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ ఆ దొంగ మాత్రం.. ఆకలేస్తోంది తినడానికి చికెన్‌ నగెట్స్‌ బాక్స్‌ ఇవ్వమని అడిగాడు. అయితే అది ఉదయం కావడంతో నగెట్స్‌ ఇంకా సిద్ధం కాలేదు. దీంతో రెస్టరెంట్ టీమ్‌ అతనికి మఫిన్‌ బర్గర్‌ ఇచ్చారు. ఈ క్రమంలో దుండగుడు చేసిన పనులు, బేరాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

  సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ దొంగను రూడీ బేటన్‌గా గుర్తించి పట్టుకోగలిగారు. దుండగుడు మెక్‌డి నుంచి 434 యూరోలు మాత్రమే దొంగిలిచాడు. ఉదయం కావడంతో కౌంటర్‌లో పెద్దగా డబ్బు ఎక్కువగా లేదు. అయితే చేసిన తప్పును బేటన్‌ ఒప్పుకున్నాడు. తనకు అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చడానికి దొంగతనం చేయాల్సి వచ్చిందని అతడు చెప్పాడు. ఈ నేరానికి పాల్పడ్డందుకు బేటన్‌కు న్యాయస్థానం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది.

  ఇది కూడా చదవండి: Stay Home: బయటకు రావొద్దని ఇలా కూడా చెప్పొచ్చా.. ఇదెక్కడి మాస్ పాట మామా.. వీడియో చూస్తే..

  బేటన్‌ చేసిన పని గురించి సోషల్‌ మీడియాలో రకరకాల జోకులు వినిపిస్తున్నాయి. దోపిడీ చేయడానికి వెళ్లేటప్పుడు సమయం, సందర్భం చూసుకోవాలని కొందరు వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. ఉదయాన్నే వెళ్తే కౌంటర్లో పెద్ద మొత్తం దొరకదని గుర్తుండాలి కదా అని కొందరు అంటుంటే.. ఇంకొందరు దొంగతనానికి వెళ్లినవాడు ఆ పని చేసుకురాకుండా ఈ తిండి పిచ్చి ఏంటి అని విమర్శిస్తున్నారు. డబ్బులు తక్కువగా ఉన్నాయి కాబట్టే.. కౌంటర్‌ దగ్గర ఉన్న వ్యక్తి వెంటనే ఇచ్చేశాడు అనే జోకులూ వినిపిస్తున్నాయి.

  First published:

  Tags: Hungry people, Robbery

  ఉత్తమ కథలు