Bizarre: ‘దొంగతనం చేయబోయి పారిపోతుంటే నన్నే కొడతారా’ అని పోలీసులకు ఫిర్యాదు చేసిన చోరుడు

జయకుమార్‌పై దాడి దృశ్యాలు

నడిరోడ్డుపై ఎవరైనా దొంగ చోరీ చేసి పారిపోతుంటే ఆ బాధితుడు ‘దొంగ.. దొంగ.. పట్టుకోండి.. పట్టుకోండి.. నా పర్స్ కొట్టేసి పారిపోతున్నాడు’ అని అరుస్తాడు. రోడ్డు మీద ఉన్న జనం స్పందిస్తే.. ఆ దొంగను పట్టుకుని.. నాలుగు తగిలించి.. ఆ పర్స్ బాధితుడికి ఇప్పించి.. ఆ దొంగ గురించి పోలీసులకు సమాచారం అందిస్తారు.

  • Share this:
    బెంగళూరు: నడిరోడ్డుపై ఎవరైనా దొంగ చోరీ చేసి పారిపోతుంటే ఆ బాధితుడు ‘దొంగ.. దొంగ.. పట్టుకోండి.. పట్టుకోండి.. నా పర్స్ కొట్టేసి పారిపోతున్నాడు’ అని అరుస్తాడు. రోడ్డు మీద ఉన్న జనం స్పందిస్తే.. ఆ దొంగను పట్టుకుని.. నాలుగు తగిలించి.. ఆ పర్స్ బాధితుడికి ఇప్పించి.. ఆ దొంగ గురించి పోలీసులకు సమాచారం అందిస్తారు. పోలీసులు ఆ దొంగను అరెస్ట్ చేస్తారు. ఇదంతా ఎప్పుడూ జరిగేదే. కానీ.. బెంగళూరులోని దొమ్లూర్ ప్రాంతంలో రొటీన్‌కు భిన్నంగా జరిగింది. చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలమైన ఓ యువకుడు పారిపోతుండగా కొందరు పట్టుకుని దేహశుద్ధి చేశారు.

    అయితే.. ఆ చోరీకి యత్నించిన యువకుడే తనపై కొందరు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా ఆ యువకుడి ఫిర్యాదును స్వీకరించి.. అతనిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయడం కొసమెరుపు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రితేష్ జయకుమార్(18) అనే యువకుడు సెప్టెంబర్ 2న రోడ్డు పక్కన పార్క్ చేసిన ఓ క్యాబ్‌ను చూశాడు. ఆ క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో బెదిరించి.. చోరీ చేయాలని చూశాడు.

    క్యాబ్ డ్రైవర్ ప్రతాప్ పాటిల్ దగ్గరకు వెళ్లి కత్తితో బెదిరించాడు. ‘నీ దగ్గర ఉన్న ఫోన్, డబ్బు ఇవ్వు.. లేకపోతే కత్తితో పొడిచి చంపేస్తా’ అని బెదిరించాడు. అయితే.. ప్రతాప్ పాటిల్ కాస్త ధైర్యం చేసి జయకుమార్‌ను పక్కకు తోసేశాడు. ‘దొంగ.. దొంగ’ అని కేకలేశాడు. తన ప్లాన్ ఫెయిల్ కావడంతో అక్కడి నుంచి పారిపోతున్న జయకుమార్‌ను కొందరు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయితే.. ఆ సమయంలో కూడా దగ్గరకు వచ్చిన వాళ్లను కత్తి చూపించి జయకుమార్ బెదిరించాడు. అతని చేష్టలు శృతి మించడంతో కొందరు నాలుగు తగిలించారు. ఎట్టకేలకు అక్కడి నుంచి జయకుమార్ తప్పించుకుని పారిపోయాడు. క్యాబ్ డ్రైవర్ పాటిల్ మాత్రం దొంగతనానికి యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానికుల దాడిలో గాయపడిన జయకుమార్‌ను గుర్తించిన పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. అయితే.. జయకుమార్ కూడా కౌంటర్‌గా ఫిర్యాదు చేయడం కొసమెరుపు.

    ఇది కూడా చదవండి: Shocking Incident: అయ్యో పాపం.. ఈ అమ్మాయి.. కాలేజీ నుంచి అన్నయ్య బైక్‌పై తిరిగొస్తుంటే ఇతనొచ్చి...

    క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించి డబ్బు, ఫోన్ దొంగిలించాలని ప్రయత్నించానని.. అతను కేకలేయడంతో పారిపోతున్న తనపై 30 నుంచి 40 మంది మూకుమ్మడిగా దాడికి దిగారని.. వాళ్ల దాడిలో తలకు, నోటికి, కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని జయకుమార్ ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జయకుమార్ ఫిర్యాదులో కోరాడు. పోలీసులు అతని ఫిర్యాదు మేరకు వారిపై సెక్షన్స్ 323, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేయడంపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దొంగ కత్తి చూపించి బెదిరించినా అతనిని అడ్డుకునేందుకు రిస్క్ చేసిన వారిపై కేసు పెట్టడం ఏంటనే వాదన తెరపైకొచ్చింది. అయితే.. పోలీసులు మాత్రం.. ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం పోలీసులుగా తమ విధి అని.. నేరస్తులను పట్టుకునేందుకు ప్రజల సహకారాన్ని తాము కోరుకుంటామని, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు దిగడం సరికాదని పోలీసులు చెబుతున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: