హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: వామ్మో.. బ్రిడ్జ్ రెయిలింగ్ మీద వేలాడుతూ ఫోన్ స్నాచింగ్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

OMG: వామ్మో.. బ్రిడ్జ్ రెయిలింగ్ మీద వేలాడుతూ ఫోన్ స్నాచింగ్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

రెయిలింగ్ నుంచి వేలాడుతూ దొంగతనం చేస్తున్న దుండగుడు

రెయిలింగ్ నుంచి వేలాడుతూ దొంగతనం చేస్తున్న దుండగుడు

Bihar: ఇద్దరు యువకులు రైలులో స్టేప్స్ మీద కూర్చున్నారు. ఇంతలో రైలు నదిని క్రాస్ చేస్తుంది. బ్రిడ్జ్ మీద నుంచి ప్రయాణిస్తుంది. ఒక యువకుడు తన సెల్ ఫోన్ లో నీటి ప్రవాహాన్ని రికార్డు చేస్తున్నాడు.

చోరీ చేయడం కూడ ఒక ఆర్ట్. కొందరు చాలా తెలికగా దొంగతనాలు చేస్తుంటారు. వీరు టార్గెట్ ను ఎంచుకుంటారు. ఆ తర్వాత సమయం చూసి ఈజీగా (Robbery) దొంగతనం చేసేస్తుంటారు. మరికొందరు చోరీలు చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. దొంగతనాలకు ప్లాన్ లు వేస్తుంటారు. రెక్కీలు నిర్వహిస్తుంటారు. ఇన్ని ప్లాన్ లు వేసినప్పటికి ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతుంటారు. మనం తరచుగా బంగారం, బట్టలు, మద్యం దుకాణాల్లో దొంగతనాలు చేస్తుండే ఘటనలు చూస్తుంటాం.

దీనిలో దొంగలు కాస్లీగా డ్రెస్ లు వేసుకుని, ఏవో కొన్నట్లు బిల్డప్ లు ఇచ్చి చోరీలు చేస్తుంటారు. అయితే, అప్పుడప్పుడు బస్సులు, రైళ్లలో కూడా చోరీలు జరుగుతుంటాయి. రైళ్లలో అర్ధరాత్రి గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు, ట్రైన్ చైన్ లాగి రైలు లోపలికి ప్రవేశిస్తుంటారు. అందిన కాడికి దొంగతనం చేసి పారిపోతుంటారు. మెయిన్ గా రైలులో కిటికి పక్కన, మెట్లపై చోరీలు జరిగిన సంఘటనలు కొకొల్లలు. ఈ కోవకు చెందిన చోరీ ఒకటి నెట్టింట వైరల్ గా (Viral video) మారింది.


పూర్తి వివరాలు.. బీహర్ లో (Bihar) దొంగలు బీభత్సాన్ని సృష్టించారు. పాట్నా, బెగుసరాయ్ ప్రాంతం మధ్యలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది. ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు, బీహర్ లోని రాజేంద్ర సేతు వంతెన మీద ప్రయాణిస్తుంది. రైలులో ఇద్దరు యువకులు మెట్లమీద కూర్చుని ఉన్నారు. అక్కడ నదిలో నీరు అందంగా ప్రవహిస్తుంది. యువకులు, రైలు మెట్లపైన కూర్చుని నదీ ప్రవాహాన్ని తమ సెల్ ఫోన్ లో రికార్డు చేస్తున్నారు. ఇంతలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. బ్రిడ్జ్ నుంచి ఒక వ్యక్తి వేలాడుతూ.. రైలు మెట్లపై ఉన్న యువకుడి చేతిలోని సెల్ ఫోన్ లను లాక్కున్నాడు.

అతనికి కాసేపు ఏంజరిగిందో కూడా అర్థం కాలేదు. ఒకవైపు భారీ నీటి ప్రవాహం, మరో వైపు సెల్ ఫోన్ ను గుర్తు తెలియని దుండగుడు లాక్కున్నాడు. పాపం.. యువకుడు కొన్ని నిముషాల తర్వాత కొలుకొని, జరిగిన విషయాన్ని రైలులో ఉన్నవారికి చెప్పాడు. అయితే, అక్కడే మరో యువకుడు నీటిని రికార్డు చేస్తున్నాడు. అతని వీడియోలో ఆగంతకుడు చోరీకి పాల్పడిన విధానం రికార్డు అయ్యింది. అతను తన చేతిని తాడు సహాయంతో పట్టుకున్నాడు. ముఖానికి నలుపు రంగు మాస్క్ వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Socia media)  వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ తో నోరెళ్ల బెడుతున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bihar, Cell phone, Robbery, Train, Viral Video

ఉత్తమ కథలు