Viral Video: రోడ్డుపై ఈ వ్యాపారి చేసిన పని చూస్తే షాక్ అవుతారు.. వైరల్ గా మారిన వీడియో

street food

ఈ వీడియో చూసిన తరువాత అసలు రోడ్డుపై ఏదైనా తినాలి అంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఆ వ్యాపారీ చేసిన పని వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. మీరూ చూడండి..

  • Share this:
    రోడ్డుపైన ఏదైనా తినాలి అంటే భయపడాల్సి వస్తోంది. అసలే కరోనా టైంతో చాలామంది రోడ్డుపై తినడం తగ్గించారు. అయితే ఇప్పుడిప్పుడు పరిస్థితి చక్కబడుతోందని భావించి కొందరు మళ్లీ రొటీన్ గా రోడ్డుపై ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. అయితే అలాంటి వారికి మంచి ఆహారం అందించాల్సిన తోపుడుబండి వ్యాపారులు కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మొన్నీమధ్య ఉమ్మి వేసి పరోటాలను చేస్తోన్న వీడియో ఒకటి వైరల్ కాగా, అంతకముందు పానీపూరిల్లో మురికి నీరును ఉపయోగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేసింది. తాజాగా అలాంటిదే ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎప్పటిదో.. ఎక్క్డడితో తెలియకపోయినా.. ప్రస్తుతం నెట్టింట్లో మాత్రం వైరల్ గా మారింది. ఆ వీడియోను చూస్తే మీరు కూడా షాక్ అవ్వడం పక్కా.. కరోనా వైరస్ భయపెడుతున్న సమయంలో ఆ వ్యాపారీ చేసిన పనికి కచ్చితంగా నోరు వెళ్లబెడతారు..

    సాధరణంగా కరోనా సమయంలో అంతా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే అసలే ఇది వర్షకాలం.. వైరల్ ఫీవర్ల సీజన్ ఇలాంటి సమయంలో అపరిశుభ్రమైన వాతావరణం ఉంటే వ్యాధిని మరింతగా వ్యాప్తి చేస్తుందని వైద్యులు అంటుంటారు. అందుకే పరిసరాలను ఎలప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతారు. అయితే ఇక్కడ ఈ వీడియోలోని వ్యక్తి ప్లేట్‌లను మురికినీటితో శుభ్రపరుస్తూ.. ప్రజల జీవితాలతో ఆట ఆడుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత రోడ్డు పక్కన బండ్ల మీద ఫుడ్‌ను తినాలనుకునేవారు ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు.  http://




    ఈ వీడియోను ‘జట్వాడి.స్టైల్’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. తక్కువ వ్యవధిలో వైరల్‌గా మారింది. ఇప్పటిదాకా ఈ వీడియోను లక్షా 50 వేల మంది వీక్షించారు. కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: