హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Monkey Clash: నడిరోడ్డుపై కోతుల గ్యాంగ్ వార్.. రక్తం కారేలా కొట్టుకున్నాయి.. గంటల కొద్దీ ట్రాఫిక్​ జామ్​.. వీడియో వైరల్

Monkey Clash: నడిరోడ్డుపై కోతుల గ్యాంగ్ వార్.. రక్తం కారేలా కొట్టుకున్నాయి.. గంటల కొద్దీ ట్రాఫిక్​ జామ్​.. వీడియో వైరల్

నడిరోడ్డుపై కోతుల గ్యాంగ్ వార్ (Image:Facebook/Wisrut Suwanphak)

నడిరోడ్డుపై కోతుల గ్యాంగ్ వార్ (Image:Facebook/Wisrut Suwanphak)

కోవిడ్​ నిబంధనలు అమల్లో ఉన్నందున ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు తగ్గిపోయారు. దీంతో వీటికి తిండి పెట్టే వారు కరువై ఒకేసారి రోడ్లపైకి వచ్చేశాయి. దొరికిన ఏ చిన్నపాటి ఆహారమైనా దక్కించుకునేందుకు ఒకదానితో మరొకటి పోట్లాడుకున్నాయి.

కొంత మంది యువకులు రోడ్లపైకి చేరి గ్యాంగ్​ వార్​లు చేసుకునే సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటాం. ఇలాంటి ఘటనలు బయట కూడా అక్కడక్కడా జరుగుతుంటాయి. రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణతో విచ్చలవిడిగా కొట్టేసుకుంటారు. ఎవరో ఆకతాయిలు లేదా రౌడీ గ్యాంగ్‌లు ఇలా రోడ్లపైకి వచ్చి హల్ చల్ చేయడం చూశాం. కానీ కోతులు గ్యాంగ్​ వార్​ చేయడం ఎప్పుడైనా విన్నామా?.. ఆశ్చర్యంగా ఉంది కదూ!.. ఈ వింత ఘటన థాయిలాండ్​లో చోటు చేసుకుంది. రోడ్లపైకి వందల సంఖ్యలో కోతులు వచ్చేసి గ్యాంగ్​ వార్​ మొదలెట్టేశాయి. వచ్చి పోయే వాహనాలను పట్టించుకోకుండా రోడ్డంతా మాదే అన్నట్లుగా తెగ కొట్టేసుకున్నాయి. ఈ ఘటన చూసిన వాహనదారులు భయపడి అక్కడే ఆగిపోవడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్​ జామ్​ అయ్యింది.

* భారీగా నిలిచిపోయిన వాహనాలు

ఈ ట్రాఫిక్​ను క్లియర్​ చేయడానికి పోలీసులకు గంటలకు పైగా సమయం పట్టింది. కోతులకు సంబంధించిన ఈ గ్యాంగ్ వార్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్​ అవుతోంది. ట్రాఫిక్​లో చిక్కుకున్న విస్రుత్ సువాన్‌ఫాక్ అనే ఫేస్‌బుక్‌ యూజర్​ ఈ గ్యాంగ్​వార్ వీడియోను ఫేస్​బుక్​​ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. ఈ వీడియోకు ఇప్పటికే లక్షల కొద్ది వ్యూచ్​ వచ్చాయి. ఇక, దాదాపు 10 వేల మంది వీడియోను షేర్​ చేశారు.

ఆహారం దొరక్కపోవడంతో రొడ్లపైకి..

థాయిలాండ్​లోని ప్రాంగ్ శామ్ యోత్ ప్రాంతంలో గల ప్రసిద్ధ ఫ్రాకన్ బౌద్ధ పుణ్యక్షేత్రం ఎదురుగా ఘటన జరిగింది. ఈ పాపులర్​ టూరిస్ట్ ప్రాంతంలో వేలకొద్ది కోతులు నివసిస్తుంటాయి. అయితే కోవిడ్​ నిబంధనలు అమల్లో ఉన్నందున ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు తగ్గిపోయారు. దీంతో వీటికి తిండి పెట్టే వారు కరువై ఒకేసారి రోడ్లపైకి వచ్చేశాయి. దొరికిన ఏ చిన్నపాటి ఆహారమైనా దక్కించుకునేందుకు ఒకదానితో మరొకటి పోట్లాడుకున్నాయి. ఇలా రోడ్లపైకి వచ్చి గ్యాంగ్​ వార్​ను తలపించేలా కొట్టుకున్నాయి. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాటి గొడవను ఆపేందుకు వాహనదారులు కూడా భయపడ్డారు. ఫలితంగా అవి మరింతగా రెచ్చిపోయాయి. వీధిలో రక్తం కారేలా కొట్టుకున్నాయి. ఈ గ్యాంగ్ వార్‌లో అనేక కోతులు తీవ్రంగా గాయపడ్డాయి.

First published:

Tags: Gang war, Monkeys, Thailand, Trending videos, Viral Video

ఉత్తమ కథలు