సరికొత్త రికార్డు సృష్టించిన RIL .. దేశ చరిత్రలోనే తొలిసారి..

RIL : మార్కెట్ విలువను అంతకంతకు పెంచుకుంటూ పోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశ చరిత్రలోనే తొలిసారి రూ.10లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన కంపెనీగా అవతరించింది.

news18-telugu
Updated: November 28, 2019, 10:58 AM IST
సరికొత్త రికార్డు సృష్టించిన RIL .. దేశ చరిత్రలోనే తొలిసారి..
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ (File Photo)
  • Share this:
మార్కెట్ విలువను అంతకంతకు పెంచుకుంటూ పోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశ చరిత్రలోనే తొలిసారి రూ.10లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన కంపెనీగా అవతరించింది. కంపెనీ షేర్ రూ.1581.25కు చేరి కొత్త మార్క్ సాధించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్‌లోనే అతి పెద్ద కంపెనీగా నిలిచింది. ఈ మధ్యే ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఇంధన దిగ్గజంగా అవతరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఎలైట్ క్లబ్‌లో చేరింది. ఆ సమయంలో ప్రపంచంలోనే మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో బ్రిటీష్ మల్టీ నేషనల్ ఆయిల్ కంపెనీ ‘బీపీ’ని వెనక్కి నెట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆరవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. జియో, రిలయన్స్ రిటైల్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఏడాది కాలంలో 31 శాతం వృద్ధిని సాధించింది.

First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు