RIHANNA IS NOW OFFICIALLY A BILLIONAIRE AND THE WEALTHIEST FEMALE MUSICIAN IN THE WORLD ACCORDING TO FORBES GH SSR
Billionaire Rihanna: పాప్‌స్టార్ రిహన్నా మరో రికార్డు.. అత్యంత ధనికురాలైన మహిళా మ్యూజిషియన్‌గా గుర్తింపు
Image credits Instagram
పాప్ స్టార్ రిహన్నా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ధనికురాలైన మహిళా మ్యూజిషియన్‌గా అవతరించింది. ఫోర్బ్స్ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం రిహన్నా ఈ ఘనత సాధించినట్లు తేలింది. తాజా వివరాల ప్రకారం రిహన్నా ఆస్తి 1.7 బిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ తెలిపింది.
పాప్ స్టార్ రిహన్నా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ధనికురాలైన మహిళా మ్యూజిషియన్‌గా అవతరించింది. ఫోర్బ్స్ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం రిహన్నా ఈ ఘనత సాధించినట్లు తేలింది. తాజా వివరాల ప్రకారం రిహన్నా ఆస్తి 1.7 బిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ తెలిపింది. అందులో 1.4 బిలియన్ డాలర్లు ఫెంటీ బ్యూటీ కాస్మోటిక్స్ కంపెనీ నుంచే వస్తున్నాయని తెలిపింది.
రిహన్నా ఆదాయంలో మిగిలిన భాగంగా ఆమెకు చెందిన సేవేజ్ ఎక్స్ ఫెంటీ అనే లింగరీ కంపెనీ నుంచి వస్తుందట. ఆ సంస్థ నుంచి ఆదాయం 270 డాలర్ల వరకు ఆదాయం సమకూరుతోందట. ఇవి కాకుండా మ్యూజిక్, యాక్టింగ్ నుంచి కూడా ఆమెకు మరికొంత ఆదాయం వస్తోందని ఫోర్బ్స్ లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఇక ఫిమేల్ ఎంటర్టైనర్ల పరంగా చూస్తే... రిహన్నా రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో ఓప్రా విన్ఫ్రే ఉన్నారు.
రిహన్నా అసలు పేరు రోబిన్ ఫెంటీ. 2017లో ఫెంటీ బ్యూటీ పేరుతో ఓ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. అందులో భాగంగా లగ్జరీ గూడ్స్‌ను రూపొందిస్తున్నారు. ఈ ప్రోడక్ట్స్ 40 రకాల ఫౌండేషన్ షేడ్స్ తీసుకొచ్చింది. ఆ క్రమంలో మేకప్ ప్రోడెక్ట్స్ రంగంలో చిన్నసైజ్ విప్లవం తీసుకొచ్చిందని మార్కెట్ వర్గాలు చెబుతుంటాయి. ఆ సంస్థ వార్షిక ఆదాయం 550 మిలియన్ల డాలర్లు ఉంటుంది.
అయితే ఫెంటీ ఫ్యాషన్ లేబుల్ మూసేయాలని ఈ ఏడాది ప్రారంభంలో 33 ఏళ్ల రిహాన్నా ఇటీవల నిర్ణయించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కాస్మొటిక్స్ బిజినెస్ నెమ్మదించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ బ్రాండ్ రెండేళ్ల క్రితమే మొదలవ్వడం గమనార్హం. బార్బాడియన్ సింగర్ అయిన రిహన్నాకు చెందిన 250 మిలియన్ల రికార్డులు ఇప్పటివరకు అమ్ముడయ్యాయి. అయితే 2016 నుండి ఇప్పటివరకు రిహన్నా నుంచి ఎలాంటి ఆల్బమ్స్ రాలేదు.
అయితే రిహన్నా మళ్లీ ఓ ఆల్బమ్ చేస్తోందని సమాచారం. తన బాయ్ ఫ్రెండ్ అయిన ర్యాపర్ రాకీతో ఓ వీడియోను షూట్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దానికి సంబంధించి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో వచ్చి విజయం సాధిస్తే... రిహన్నా ఆదాయం, ఆస్తి మరింత పెరుగుతుంది. ఇటీవల కాలంలో రిహన్నా మరో విషయంతో మన దేశంలో ప్రాచుర్యం సంపాదించిది.
దేశంలో రైతుల ఉద్యమం నేపథ్యంలో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై రైతులు చేస్తున్న ఉద్యమానికి రిహన్నా మద్దతు పలికింది. ‘‘మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదు?’’ అంటూ రైతుల ఉద్యమంపై సీఎన్ఎన్ ప్రచురించిన కథనాన్ని రిహన్నా ట్వీట్ చేసింది. దాంతో పలువురు భారతీయ సెలబ్రిటీలు ఆమెపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.