కుర్రాళ్ల చేష్టలు మరీ మితిమీరిపోతున్నాయి. పబ్లిక్ ప్లేసు లేదు..పర్సనల్ ప్లేసని చూడటం లేదు. వాళ్ల వెకిలి చేష్టలు, వికృత పనులు చూసి నవ్వుతారనే సిగ్గు కూడా లేకుండా బరితెగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని అమ్రోహా(Amroha)జిల్లాలో ఓ ప్రేమజంట వెలబెట్టిన ఘనకార్యం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. ఆ మధ్య లక్నోలో ఓ ప్రేమజంట బైక్(Bike)పై రొమాన్స్ (Romance)చేస్తున్న వీడియో కంటే ఇది మరింత అసభ్యకరంగా ఉంది. సభ్యసమాజం ఏమనుకుంటుందో చూడకుండా రన్నింగ్ బైక్‌పై మూడో వ్యక్తి బైక్ నడుపుతుంటే ..మధ్యలో యువతి కూర్చుంటే..చివరి సీట్లో కూర్చున్న ప్రియుడు యువతితో ముద్దు ముచ్చట్లు ఆడుతూ రోడ్డుపై వెళ్తున్న వారి కంట పట్టారు. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది.
బైక్‌పై రొమాన్స్ ..
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఓ ప్రేమజంట ..రన్నింగ్ బైక్‌పై రొమాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. హసన్‌పూర్ గజ్రౌలా రోడ్డులో ఒకే బైక్‌పై ట్రిపుల్ రైడ్ చేస్తుంటే రోడ్డుపై వెళ్తున్న జనం చూసి ఆశ్చర్యపోయారు. ఇందులో గమ్మత్తైన విషయం ఏమిటంటే బైక్‌పై ఇద్దరు కూర్చోలేదు. ముగ్గురు ఉన్నారు. ఒకరు బైక్ నడుపుతుంటే మధ్యలో ప్రియురాలిని కూర్చబెట్టి ముద్దులు పెట్టుకోవడం, చేతులతో చుట్టేసుకొని కౌగిలించుకోవడం చేస్తుంటే రోడ్డుపైన పోయే జనం విచిత్రంగా చూస్తుండిపోయారు. కొందరు ఈ లవ్ బర్డ్స్ బైక్‌పై చేస్తున్న రొమాన్స్‌ని తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోనే వైరల్ అవుతోంది.
ఇద్దరబ్బాయిల మధ్యలో కూర్చున్న యువతి..
ఇద్దరు యువకుల మధ్య బైక్ కూర్చున్న యువతి ..కనీసం రోడ్డుపై ఎవరైనా చూస్తారనే సిగ్గు కూడా లేకుండా..పచ్చిగా రొమాన్స్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆడవాళ్లు ఇంతలా బరితెగిస్తారా అంటూ విమర్శలు చేస్తున్నారు. నేటి యువత కొన్ని విషయాల్లో ఆదర్శంగా నిలుస్తుంటే మరికొందరు ..ఈవిధంగా వెకిలి చేష్టలు, వికృత పనులు చేస్తూ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తున్నారు.
వైరల్ వీడియో ..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వీడియోలోని బైక్ నెంబర్ ఆధారంగా ట్రిపుల్ రైడింగ్ ఫైన్ విధించడంతో పాటు పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్ చేసిన జంట ఎవరూ అంటూ ఆరా తీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Love story, Uttar pradesh, Viral Video