HOME »NEWS »TRENDING »rewind 2020 worth to watch dont miss it ms

Rewind 2020: కరోనా సహా మరెన్నో విలయాలు.. ఈ ఏడాదిలో ఏం జరిగిందో 2 నిమిషాల్లో చూసేయండి..

Rewind 2020: కరోనా సహా మరెన్నో విలయాలు.. ఈ ఏడాదిలో ఏం జరిగిందో 2 నిమిషాల్లో చూసేయండి..
ప్రతీకాత్మక చిత్రం

Rewind 2020: దాదాపు ఐదు నెలల పాటు ప్రపంచమంతా స్తంభించిపోయింది. ఇంటి నుంచి గాలి కూడా బయటకు పోలేదు. బయటి గాలి ఇంట్లోకి రాలేదు. అంతా అష్ట దిగ్బంధనమే. కరోనా కొంచెం వెనక్కి పట్టిందనుకునే లోపే మరో సంక్షోభం రెడీగా వచ్చింది. అసలు ఈ ఏడాదంతా విషాదాలకు చిరునామాకు మిగిలిపోయింది.

  • News18
  • Last Updated: December 24, 2020, 21:38 IST
  • Share this:
    2020.. గత మూడు నాలుగు తరాలుగా ప్రపంచాన్ని గమనిస్తున్న వారు ఈ ఏడాదంత విషాదాన్ని మరొకటి చూసుండరు. చైనాలో మొదలైన మాయదారి రోగం కరోనాతో ప్రారంభమైన ఈ ఏడాది.. ఇప్పటికీ తన పంజా విసురుతూనే ఉన్నది. లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. కోట్లాది మంది దీని బారిన పడి చెప్పరాని బాధలు పడుతున్నారు. దాదాపు ఐదు నెలల పాటు ప్రపంచమంతా స్తంభించిపోయింది. ఇంటి నుంచి గాలి కూడా బయటకు పోలేదు. బయటి గాలి ఇంట్లోకి రాలేదు. అంతా అష్ట దిగ్బంధనమే. అది కొంచెం వెనక్కి పట్టిందనుకునే లోపే మరో సంక్షోభం రెడీగా ఉంది. అసలు ఈ ఏడాదంతా విషాదాలకు చిరునామాకు మిగిలిపోయింది. మానవ మనుగడకే సవాల్ విసిరిన 2020 త్వరలోనే ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగిన పలు విలయాలను ఇక్కడ చూద్దాం.

    ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన కరోనా.. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. అప్పటినుంచి ఏదో ఒక సంక్షోభం ప్రపంచ ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తూనే ఉన్నది. ఈ ఏడాది మొదట్లోనే ఆస్ట్రేలియా అడవుల్లో రేగిన కార్చిచ్చు.. వేలాది మూగజీవాలను పొట్టన పెట్టుకుంది.  ఇక బీరుట్ పేలుళ్లలో జరిగిన విస్పోటనం అంతా ఇంతా కాదు.







    ఇదే ఏడాదిలో అగ్రరాజ్యం అధినేత ట్రంప్ పై అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. ఆ సమయంలోనే ఆయన పదవి నుంచి దిగిపోయినంత పనైంది. ఎలాగోలా ఆయన గట్టెక్కినా.. ఆ తర్వాత అక్టోబర్ లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ఇరాన్ ఆర్మీ కమాండర్ జనరల్ కాసిం సులేమానిని అమెరికా చంపడం పెద్ద వార్తే అయింది. ఆయన శవయాత్రకు వచ్చిన ప్రజలను చూస్తే అర్థమవుతుంది ఆయన ఎంతటి కీలకవ్యక్తో.

    అమెరికాలో బ్లాక్ లివ్స్ మ్యాటర్, హెలికాప్టర్ ప్రమాదంలో కోబ్ బ్రయంట్ మరణం, టోక్యోలో వరదలు...బీరుట్ లో పేలుళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ ఏడాదంతా ఒక పీడకలగానే గడిచింది. వీటన్నింటినీ క్రోడీకరకించి ఒక వీడియోను తయారు చేశారు. రెండు నిమిషాల 20 సెకండ్లు ఉన్న ఆ వీడియో ఈ ఏడాది సంక్షోభాలన్నింటినీ గుర్తుకు తెస్తున్నది.
    Published by:Srinivas Munigala
    First published:December 24, 2020, 21:38 IST

    टॉप स्टोरीज