news18
Updated: November 14, 2020, 1:15 PM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 14, 2020, 1:15 PM IST
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మూగ జీవాలు తప్పిపోతే.. అవి పెంచుకుంటున్న వారి బాధ వర్ణణాతీతం. ఇటీవలే ఒక ఉన్నతాధికారి భార్య ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లి తప్పిపోయింది. ఆ పిల్లి అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆమె రైల్వే స్టేషన్ లో రైలు కోసం వేచి చూస్తుండగా.. పెద్ద శబ్దం వినపడటంతో చేతుల నుంచి జారిపోయిన పిల్లి.. శబ్దానికి పారిపోయింది. రైల్వే స్టేషన్ మొత్తం గాలించినా దాని జాడ దొరకలేదు. దీంతో దానిని పట్టిచ్చినవారికి నగదు బహుమానం ప్రకటించారు. ఇదేదో సాధారణ వ్యక్తులనుకునేరు.. తప్పిపోయిన పిల్లిని వివిఐపీలు పెంచుకుంటున్నారు. ఇంతకీ ఎవరు వాళ్లు...?
అది ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్. అక్కడ ఒక వ్యక్తి రైలు కోసం వేచి చూస్తున్నారు. తన కూడా కూతురు, కార్ డ్రైవర్ ఉన్నారు. కూతురు చేతిలో రెండేళ్ల వయసున్న పిల్లి. ఇంతలో స్టేషన్ కు రైలు వచ్చింది. పెద్ద శబ్దం. అంతే.. ఆ శబ్దానికి భయపడ్డ పిల్లి.. అక్నడ్నుంచి భయంతో పారిపోయింది. స్టేషన్ లో రైలు కోసం వేచి చూస్తున్నది నేపాల్ మాజీ ఎన్నికల కమిషనర్ ఐలా శర్మ. భారత మాజీ ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన ఎస్.వై.ఖురేషి భార్య. పారిపోయిన పిల్లి ఆమె పెంచుకుంటున్నదే.
రైలొచ్చిన శబ్దానికి పారిపోయిన పిల్లి మళ్లీ కనిపించలేదు. ఎంత వెతికినా అది దొరకలేదు. దీంతో ఐలా శర్మ నిరాశతో వెనుదిరిగారు. తన ప్రయాణాన్ని కూడా రద్దు చేసుకున్నారు. ఇదే క్రమంలో ఆ పిల్లి ఎవరికైనా కనిపిస్తే వారికి నగదు బహుమానం ప్రకటిస్తామని ప్రకటించారు.
ఇందులో భాగంగానే తమ తప్పిపోయిన పిల్లిని తెచ్చిచ్చిన వారికి రూ. 11 వేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. రెండేళ్ల వయసున్న పిల్లి... ముక్కు మీద గోధుమ రంగు మచ్చ ఉంటుందని.. కళ్లు ఆకుపచ్చగా ఉంటాయని ఆనవాళ్లు కూడా చెప్పారు. అయితే నగదు బహుమానాన్ని రూ. 11 వేల నుంచి రూ. 15 వేలకు పెంచారు. ఇదే విషయమై గోరఖ్పూర్ వ్యాప్తంగా పోస్టర్లను అతికించారు. పోలీసులు కూడా ఆ పిల్లి కోసం గాలిస్తున్నారు.
Published by:
Srinivas Munigala
First published:
November 14, 2020, 1:15 PM IST