#MeToo మూమెంట్‌పై మోహన్‌లాల్ కామెంట్స్... రేవతి కౌంటర్...

మీటూ మూమెంట్‌ కేవలం ఓ ఫ్యాషన్ ట్రెండ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్‌లాల్... వేరే గ్రహం నుంచి ఊడిపడిన ఇలాంటి మనుషులుంటే ‘మార్పు’ ఎలా తేగలం అంటూ కౌంటర్ ఇచ్చిన నటి రేవతి

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 23, 2018, 8:11 PM IST
#MeToo మూమెంట్‌పై మోహన్‌లాల్ కామెంట్స్... రేవతి కౌంటర్...
రేవతి, మోహన్‌లాల్ (Photo: twitter)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 23, 2018, 8:11 PM IST
బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు రాజకీయ, క్రీడా రంగాలను అతలాకుతలం చేస్తున్న మీటూ మూమెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్. ‘మీటూ మూమెంట్ కేవలం ఓ ఫ్యాషన్’ అంటూ వ్యాఖ్యానించిన మోహన్‌లాల్, మలయాళ ఇండస్ట్రీలో మీటూ మూమెంట్ పెద్ద సమస్య కాదని కొట్టిపారేశాడు. ‘మలయాళం సినీ ఇండస్ట్రీలో పెద్ద సమస్యలేమీ లేవు. ‘మీటూ మూమెంట్’ నిజంగా ఉందని మీరు భావిస్తున్నారా... అదో వ్యామోహం... ఒకరిని చూసి మరొకరు ఫ్యాషన్‌లా ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎంతోకాలం ఉండదు... కొద్దికాలంలోనే దీన్ని అందరూ మరిచిపోతారు...’ అంటూ దుబాయ్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు మోహన్‌లాల్.

మలయాళ సినీ ఇండస్ట్రీ నటుల అసోసియేషన్ (అమ్మ)కు అధ్యక్షుడిగా ఉన్న మోహన్‌లాల్... కొద్దికాలం క్రితం నటి భావనపై అత్యాచార కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హీరో దిలీప్‌ను అమ్మ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాడు. ఆ తర్వాత దిలీప్ బెయిల్ మీద బయటికి రాగానే ఏకపక్షంగా దిలీప్ నిషేధాన్ని ఎత్తివేసి, తిరిగి అమ్మలో సభ్యత్వం కల్పించాడు మోహన్‌లాల్. మలయాళ సూపర్‌స్టార్ చేసిన ఈ చర్య కారణంగా నటీమణుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. కొంతమంది హీరోయిన్లు మలయాళ మూవీ అసోసియేషన్‌ సభ్యత్వాన్ని రద్దు చేసుకుని నిరసన తెలిపారు. తాజాగా ‘మీటూ’ ఆరోపణలపై సంచలన కామెంట్స్ చేసి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు మోహన్‌లాల్.
Revathy Slams Mohanlal on Twitter for Calling #MeToo Movement a ‘Fad’ ‘#MeToo మూమెంట్ ఓ ట్రెండ్’ అన్న మోహన్‌లాల్... కౌంటర్ ఇచ్చిన రేవతి...

మీటూ మూమెంట్ కేవలం ఓ ఫ్యాషన్. స్లీవ్ లెస్ షర్ట్స్, బెల్ బోటమ్ ఫ్యాంట్స్‌లా ఇది ఇప్పుడో ఫ్యాషన్ ట్రెండ్. లైంగిక వేధింపులు సినిమాల్లోనే కాదు... ప్రతీచోటా ఉంటాయి. మగవాళ్లకు కూడా ఇలాంటివి జరుగుతాయి కానీ మనం మీటూ అంటూ ఆరోపణలు చేయడం లేదుగా... అయితే అలాంటి వేధింపులు ఎదుర్కొన్నవారికే మీటూ గురించి మాట్లాడే అర్హత ఉంటుంది. నాకైతే అలాంటి అనుభవం ఎదురుకాలేదు...
మోహన్‌లాల్, మలయాళ నటుడు




‘మీటూ మూమెంట్’పై మోహన్‌లాల్ చేసిన కామెంట్లు హీరోయిన్లకు కోపం తెప్పిస్తున్నాయి. తాజాగా సీనియర్ హీరోయిన్, నటి రేవతి... మోహన్‌లాల్ కామెంట్లపై ట్విట్టర్లో స్పందించింది. ‘మీటూ మూమెంట్‌ను ఓ నటుడు ‘వ్యామోహం’ అన్నాడు. ఇలాంటి మనుషుల్లో సమస్యలను అర్థం చేసుకునే సున్నితత్వాన్ని ఎలా తేగలం. అంజలీ మీనన్ అన్నట్టుగా మార్స్ గ్రహం నుంచి ఇప్పుడే భూమి మీదకు వచ్చినవారికి వేధింపుల గురించి తెలియవు. ఇలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటే మార్పు ఎలా తేగలం...’ అంటూ కామెంట్ చేసింది రేవతి...

నటి రేవతి చేసిన ట్వీట్
Loading...


Revathy Slams Mohanlal on Twitter for Calling #MeToo Movement a ‘Fad’ ‘#MeToo మూమెంట్ ఓ ట్రెండ్’ అన్న మోహన్‌లాల్... కౌంటర్ ఇచ్చిన రేవతి...
First published: November 23, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...