పోలీసు శునకాలకు ఓల్డేజ్​హోమ్​.. రిటైర్మెంట్ తర్వాత హుందాగా జీవించేందుకు ఏర్పాట్లు.. ఎక్కడంటే..

జాగిలాల కోసం ఓల్డేజ్ హోమ్​ ఏర్పాటు

Dogs Old Age Home: పోలీసు శాఖలో శునకాలు ముఖ్య ప్రాత పోషిస్తాయి. అనేక కేసుల్లో ఆధారాలు కనుగొనేందుకు, నేరస్థులను పట్టించేందుకు పోలీసులకు ఎంతో సహకరిస్తాయి. రిటైరయ్యాక కూడా జాగిలాలు దర్జాగా జీవించేందుకు గుజరాత్ పోలీసు శాఖ ఓ ఆలోచన చేసింది. పదవీ విరమణ చేసిన పోలీసు జాగిలాల కోసం ఓల్డేజ్ హోమ్​ను ఏర్పాటు చేసింది.

  • Share this:
పోలీసు శాఖలో శునకాలు ముఖ్య ప్రాత పోషిస్తాయి. అనేక కేసుల్లో ఆధారాలు కనుగొనేందుకు, నేరస్థులను పట్టించేందుకు పోలీసులకు ఎంతో సహకరిస్తాయి. జాగిలాల సాయంతోనే పరిష్కారమైన కేసులు ఎన్నో ఉన్నాయి. ఇలా దాదాపు ప్రతీ ముఖ్యమైన కేసులో శునకాలను పోలీసులు వినియోగిస్తారు. అయితే పోలీసు శాఖ నుంచి రిటైరయ్యాక శునకాల పరిస్థితి ఏంటి.. అనేది ప్రశ్నగా ఉంటుంది. రిటైరయ్యాక కూడా జాగిలాలు దర్జాగా జీవించేందుకు గుజరాత్ పోలీసు శాఖ ఓ ఆలోచన చేసింది. పదవీ విరమణ చేసిన పోలీసు జాగిలాల కోసం ఓల్డేజ్ హోమ్​ను ఏర్పాటు చేసింది. గుజరాత్​లోని అహ్మదాబాద్​-వడోదర ఎక్స్​ప్రెస్ వే సమీపంలో ఆనంద్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ శునకాల ఓల్డేజ్ హోమ్ ఉంది. ఈ రాష్ట్రంలో ఇదే మొదటిది. పటిష్ఠమైన ఇనుప గేటు ఉండే ఈ ఓల్డేజ్​హోమ్​లో ప్రారంభంలోనే ఓ జర్మన్​ షెపర్డ్​ శునకం ఉంటుంది. “డాగ్స్​ నెవర్ బైట్స్​. జస్ట్​ హ్యూమన్స్​” అనే కొటేషన్ ఈ ఓల్డేజ్​ హోమ్​లో ఉంది. ఉత్తరప్రదేశ్​లోని మీరట్​లో అతిపెద్ద శునకాల ఓల్డేజ్​ హోమ్ ఉంది. ఆ తరువాత అతిపెద్ద రిటైర్డ్ జాగిలాల సంరక్షణ కేంద్రం తాజాగా ఆనంద్ సమీపంలో ఏర్పాటు చేసిందేనని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఇక్కడ కే-9 యూనిట్​లో రిటైరైన 11 జర్మన్ షెపర్డ్​, లాబ్రాడర్ జాతుల శునకాలు ఉన్నాయి. ఈ డాగ్ ఓల్డేజ్ హోమ్‌లో 10 సంవత్సరాల వయసు ఉన్న స్నూపీ చాలా అలర్ట్​గా ఉంటుంది. ఓల్డేజ్ హోమ్​ను పరిరక్షిస్తుంటుంది. కొత్తగా మనుషులు ఎవరు వచ్చినా అరవడంతో పాటు ఏవైనా జంతువులు వచ్చినా మిగిలిన జాగిలాలను జాగ్రత్త పరుస్తుంది. వయసు మీద పడినా పోలీసుల ట్రైనింగ్​లో ఆరితేరిన స్నూపీ ఇప్పటికీ తన బాధ్యతను నిబద్ధతతో చేస్తోంది. గుజరాత్​ పోలీసు శాఖలో 10 సంవత్సరాల పాటు స్నిఫర్ డాగ్స్​గా పని చేసిన సుశి, థండర్​, సోఫీ, వీనస్​, మీషస నికిత, క్రిస్పీ, బులె​ట్​ పేపియర్​, స్నూపీ ప్రస్తుతం ఈ ఓల్డేజ్ హోమ్​లో సేద తీరుతున్నాయి. ఇప్పుడు వాటికి ఓ కొత్త గృహం దొరికింది. సమాజానికి సేవ చేసిన జాగిలాలకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సదుపాయం కల్పించామని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది జూలై 25న గుజరాత్​ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్​ (డీజీపీ) ఆశీష్​ భాటియా ఈ డాగ్స్​ ఓల్డేజ్ హోమ్​ను ప్రారంభించారు.

శునకాలకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు కామధేను యూనివర్సిటీతో పోలీసు శాఖ ఒప్పందం చేసుకుంది. మొదటి బ్యాచ్​గా ఈ ఓల్డేజ్ హోమ్​ను నవసరి, వడోదర రైల్వే పోలీసు, అహ్వాడంగ్​, రాజ్​కోట్​, పాలన్​పూర్​కు చెందిన రిటైర్డ్ పోలీసు శునకాలను తీసుకొచ్చారు. “రిటైరైన పోలీసు శునకాలను గతంలో వేలం వేసే పద్ధతి ఉండేది. జంతు ప్రేమికులు వాటిని దత్తత తీసుకునే అవకాశం ఉండేది. అయితే ఇళలో పెంపుడు జంతువుల్లా ఉండటం పదవీ విరమణ పొందిన పోలీసు శునకాలకు సౌకర్యంగా ఉండదని మేం గుర్తించాం. అందుకే పోలీసు శునకాలకు ప్రత్యేక గృహాన్ని ఏర్పాటు చేసి, మంచి ఆహారం అందించాలని నిర్ణయించాం. సర్వీస్​లో ఉన్న విధంగానే వాటికి మంచి ఆహారం అందిస్తాం. దశాబ్దానికి పైగా మా స్నేహితుల్లా సేవలు అందించిన వాటికి కృతజ్ఞతాభావంతోనే ఈ ఓల్డేజ్ హోమ్​ను ఏర్పాటు చేశాం” అని ఆనంద్ ఎస్పీ అజిత్ రజియన్ చెప్పారు.
Published by:Veera Babu
First published: