బడి ఉంటే ఎంతో మంది విద్యావంతులను తయారు చేయవచ్చని నమ్మారాయన.. చదువు ఉంటే తనలాంటి వాళ్లను మరో పది మందిని తయారు చేయవచ్చని తలచారు.. అందుకే బడి కోసం తన ఇంటినే దానం చేసేశారు. ఆయనే.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే.అంబరీష్. ఆయన తన పాత ఇంటిని పాఠశాల కోసం బహుమతిగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హసకొత్తూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోసం తన ఇల్లును ఇచ్చేశారు. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యా కమిషనర్ విజయ్‌కుమార్‌ను కలసి విషయాన్ని తెలియజేశారు. దానికి సంబంధించిన పత్రాలను కూడా అందజేశారు. స్థల మార్పిడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.
దీంతో విజయ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అంబరీష్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆ ఇంటికి సంబంధించి గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రక్రియను చేపట్టాలని జిల్లా డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.