ఒకప్పుడు రేడియోలు, టీవీల్లో వచ్చిన యాడ్లు గుర్తున్నాయా..? నిర్మా డిటర్జెంట్ పౌడర్ నుంచి లైఫ్ బాయ్ సోప్ వరకు అప్పటి యాడ్ల పాటలు ఎంతో ఫేమస్ అయ్యాయి. అప్పటి యాడ్లలో ఉన్న మ్యాజిక్ ఇప్పుడు వచ్చే వాటిల్లో ఉండడం లేదని చాలా మంది అనేమాట. అందుకే ఇప్పటికీ ఆ పాత యాడ్ల పాటలు చాలా మందికి గుర్తుంటాయి. అప్పుడప్పుడూ హమ్ చేస్తుంటారు. అయితే అప్పటి యాడ్లను ఓ బ్యాండ్ అద్భుతంగా ఇప్పుడు పాడుతుందని.. అదీ రెస్టారెంట్లో షో ఉంటుందని అనుకుంటారా..? కానీ అలాగే జరిగింది.
వాషింగ్ పౌండర్ నిర్మా, లైఫ్ బాయ్, నిర్మా రోస్, వీకో టర్మరిక్ పాత యాడ్ల పాటలను ఓ బ్యాండ్ అద్భుతంగా ప్రదర్శించింది. రెస్టారెండ్‌లో పాత యాడ్ల పాటలతో ప్రజలను ఊర్రూతలూగించింది.
“వాషింగ్ పౌడర్ నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా” అంటూ ప్రారంభించిన మ్యూజిక్ బ్యాండ్ “పాన్ పరాగ్ పాన మసాలా”, “లైఫ్ బాయ్ హై జరాన్ తందోరుస్తి హై వహా” అంటూ సాగింది. నీమా, మ్యాగీ, హమరా బజాజ్ ఇలా పాత యాడ్లను సింగర్లు అద్భుతంగా పాడాడు. దీంతో డిన్నర్ కోసం రెస్టారెంట్ వచ్చిన వారంతా చప్పట్లు, కేరింతలు కొట్టారు. వయసు మరిచి తమ చిన్నతనానికి వెళ్లారు. తమకెంతో ఇష్టమైన యాడ్ల పాటలను చాలారోజుల తర్వాత ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. సింగర్లతో గొంతు కలిపారు. కూర్చున్న చోటు నుంచే పాటలు పాడారు.
ఈ వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పాత యాడ్లను గుర్తు చేసిన ఆ రెస్టారెంట్ బ్యాండ్‌ను ప్రశంసిస్తున్నారు. ఎంత మందికి ఈ యాడ్లు గుర్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే కచ్చితంగా సంతోషిస్తారు.