శాస్త్రవేత్తల అరుదైన ప్రయోగం.. నీటి బింధువును బంగారంగా మార్చేశారు.. దానిని ఎలా తయారు చేశారంటే..

నీటి బిందువును బంగారంగా మార్చిన వైనం

బంగారం ఎంత విలువైందో అందరికి తెలిసిందే. అలంకరణతో పాటు పెట్టుబడి మార్గంగానూ ఆదరణ పొందిన పసిడి విలువ ఎప్పటికప్పుడూ పెరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న బంగారాన్ని నీటి నుంచి తయారు చేశారు కొందరు పరిశోధకులు. ఏకంగా నీటి బింధువును ప్రకాశవంతంగా మెరిసే బంగారు లోహపు బొట్టుగా మార్చారు.

  • Share this:
బంగారం ఎంత విలువైందో అందరికి తెలిసిందే. అలంకరణతో పాటు పెట్టుబడి మార్గంగానూ ఆదరణ పొందిన పసిడి విలువ ఎప్పటికప్పుడూ పెరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న బంగారాన్ని నీటి నుంచి తయారు చేశారు కొందరు పరిశోధకులు. ఏకంగా నీటి బింధువును ప్రకాశవంతంగా మెరిసే బంగారు లోహపు బొట్టుగా మార్చారు. అయితే అది కొన్ని సెకన్లలోనే అదృశ్యమైంది. చెక్ రిపబ్లిక్ దేశంలోని చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు ఈ అద్భుత ఆవిష్కరణకు తార్కాణంగా నిలిచారు. ఈ అద్భుత దృశ్యం కొన్ని సెకన్ల పాటే కొనసాగినప్పటికీ శాస్త్రవేత్తలకు భారీ విజయాన్ని అందించింది. సిద్ధాంతం ప్రకారం చాలా పదార్థాలు అధిక పీడనం వద్ద లోహాలుగా మారతాయి. అధిక పీడనాల వల్ల అణువులు చాలా దృఢంగా మారి బయటి ఎలక్ట్రాన్‌ను పంచుకోవడం ప్రారంభిస్తాయి. అప్పుడు ఆ పదార్థం రాగి, ఇనుము మాదిరి విద్యుత్ వాహకంగా(Electric Conductor) మారుతుంది. అయితే ఇలాంటి అధిక పీడనాన్ని ప్రయోగశాలలో సృష్టించలేం. యురెనస్ లేదా నెఫ్ట్యూన్ లాంటి భారీ గ్రహాలు లోహ స్థితిలో నీటిని పెంపొందిస్తాయని, అంతేకాకుండా అధిక వాతావరణ పీడనాన్ని కలిగి ఉంటాయని జియోఫిజిస్టులు ప్రతిపాదించారు.

అధిక పీడనం లోహ హైడ్రోజన్ ను సూపర్ కండక్టర్ గా మార్చగలదని, అంటే శూన్య నిరోధకత్వంతో(Zero Resistance) విద్యుత్తును పంపిణీ చేయగలదని తెలిపారు. అలాంటి అధిక పీడనం 15 మిలియన్ల వాతావరణ పీడనంతో సమానం. పరిశోధన ఎలా చేశారంటే.. చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రసాయన శాస్త్రవేత్త పావెల్ జంగ్విర్త్ సహా అధ్యయనానికి అనుగుణంగా పరిశోధకులు ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నారు. అధిక పీడనం ప్రకారం కాకుండా ఇందులో గ్రూప్-1 ఆవర్తన మూలకాలైన సోడియం, పొటాషియం లాంటి క్షార లోహాలను వినియోగించారు. ఎందుకంటే ఈ లోహాలు వాటి వెలుపలి ఎలక్ట్రాన్ ను దానం చేస్తాయి. అందువల్ల ఎలక్ట్రాన్ ను డోప్ చేస్తే క్షార లోహపు నీటి ద్రావణం కొన్ని సెకన్ల పాటు బంగారు లోహపు బొట్టుగా మారి అదే ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ ప్రయోగంలో ఓ అవరోధం ఏర్పడింది. క్షార లోహాలు నీటితో పేలుడుగా(Explosive) ప్రతిస్పందిస్తాయి. దీన్ని ఎదుర్కొని ప్రతి చర్య పేలి పోకుండా ఉండాలంటే పరిశోధకులు ఈ ప్రయోగం నిదానంగా, జాగ్రత్తగా చేయాలి. అలా చేయడానికి పరిశోధకులు సిరంజిని రెండు క్షార లోహాలతో నింపారు.

ఎందుకంటే ఈ లోహాలు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉంటాయి. అంతేకాకుండా వాటిని వ్యాక్యూమ్ ఛాంబర్లో ఉంచారు. అనంతరం సిరంజీలో మిశ్రమాన్ని నీటి చుక్కగా ఏర్పరిచారు. నీటి బిందువుపై నీరు ఘనిభవించిన వెంటనే ఎలక్ట్రాన్, పాజిటివ్ మెటాలిక్ అయాన్లను నీటిలోకి వ్యాప్తి చేసి దాన్ని బంగారు పొరగా మార్చారు. ఈ ప్రయోగంపై పావెల్ జంగ్విర్త్ స్పందించారు."ఇది ఓ నూతన మూలకాన్ని కనుగొన్నంత అద్భుతంగా ఉంది. రోజువారీ ఉద్యోగంలో రిఫ్రెష్ బ్రేక్ లా అనిపిస్తోంది. సైన్స్ ఎంతో సరదాగా ఉంటుందని గుర్తుచేసింది" అని ఆయన అన్నారు.
Published by:Veera Babu
First published: