హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Earthquake Predictor: భూకంపం వస్తుందని మూడు రోజులే ముందే చెప్పాడు! అతనికి ఎలా తెలుసు..?

Earthquake Predictor: భూకంపం వస్తుందని మూడు రోజులే ముందే చెప్పాడు! అతనికి ఎలా తెలుసు..?

Image source Twitter/SRazaB24

Image source Twitter/SRazaB24

Earthquake Predictor: భూకంపం రాబోతుందని అతను చెప్పిన మాట అక్షరాల నిజమైంది. టర్కీ, సిరియాను భూకంపం కుదిపేసింది. ఇంతకు అతను ఎవరు..? భూకంపం వస్తుందని అతనికి ముందుగానే ఎలా తెలుసు..?

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ముందే చెప్పాడు.. మూడు రోజుల ముందే హెచ్చరించాడు.. ఎవరూ పట్టించుకోలేదు.. టర్కీ, సిరియాల్లో భూకంపం రాబోతుందని.. ఈ నెల 3వ తేదీనే చెప్పాడు.. దాని గురించి ట్వీట్ కూడా చేశాడు.. అందరూ నవ్వారు.. ఎగతాళి చేశారు.. నువ్వేమైనా జ్యోతిష్యుడివా అంటూ ఒకరు.. లేకపోతే నువ్వేమైనా పెద్ద సైంటిస్టువా అంటూ మరికొందరు కామెడీ చేశారు.. అతనో రీసెర్చర్‌ అన్న విషయం మరిచి ఇష్టం వచ్చినట్లు కామెంట్స్‌ పెట్టారు... కానీ ఏమైంది..? అతను చెప్పిందే నిజమైంది.. భూకంపం రాబోతుందని అతను చెప్పిన మాట అక్షరాల నిజమైంది. టర్కీ, సిరియాను భూకంపం కుదిపేసింది. ఇంతకు అతను ఎవరు..? భూకంపం వస్తుందని అతనికి ముందుగానే ఎలా తెలుసు..?

మూడు రోజుల ముందే చెప్పాడు:

టర్కీ, సిరియాల్లో తీవ్ర ప్రాణ నష్టాన్ని మిగిల్చిన భూకంపం గురించి ఎవరికైనా ముందే తెలుసా? తెలుసు.. నిజంగానే ఒక రీసెర్చర్‌ అంచనా వేశాడు. నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ ఫిబ్రవరి 3వ తేదీన చేసిన ట్వీట్‌ సోషల్‌మీడియాలో ఫుల్ వైరల్‌ అవుతుంది. టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ పరిసర ప్రాంతాల్లో త్వరలోనే 7.5 తీవ్రతతో భూకంపం వస్తుందని భూకంప కార్యకలాపాలపై అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే పరిశోధకుడు ఫ్రాంక్ మూడు రోజుల ముందే అంచనా వేశాడు. కానీ ట్విట్టర్‌లో కొందరు అతడిని ఓ సూడో సైంటిస్ట్‌గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు. ఫ్రాంక్‌ గతంలో చేసిన అంచనాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఫ్రాంక్‌ అంచనా అశాస్త్రీయమైనదిగా కొట్టిపారేశారు. భూకంపాలను అంచనా వేయడానికి ఖచ్చితమైన పద్ధతి లేదని వాదించారు కూడా. అయితే వీళ్ల వాదన భూకంప శిథిలాల కింద నలిగిపోయింది. ఫ్రాంక్‌ చెప్పిందే నిజమైంది.

భూకంపాలను ముందే గుర్తించవచ్చా?

భూకంపాలను ముందుగానే గుర్తించొచ్చన్న విషయంలో సైంటిస్టుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు అది సాధ్యం కాదని.. మరికొందరూ సాధ్యమేనని చెబుతుంటారు. ఎప్పుడు భూమి కంపిస్తుందో నెలలు, సంవత్సరాల ముందుగానే అంచనా వేసి చెప్పడం అసాధ్యమంటున్నారు. అయితే మరి కొందరి అభిప్రాయం దీనిక భిన్నంగా ఉంది. భూమి లోపల నీటిమట్టంపై ఒత్తిడి, వాతారణంలోని ఐనోస్పియర్‌లో మార్పులు, భూకంపాలకు ముందు వచ్చే ప్రకంపనలు, భూమి పగుళ్లలోంచి వచ్చే రెడాన్‌ వాయువులను అధ్యయనం చేయడం ద్వారా భూకంపాలను ముందే గుర్తించవచ్చని చెబుతున్నారు. అయితే ఈ ఇద్దరి వాదనలోనూ ఒక కామన్‌ పాయింట్ ఉంది. భూకంపం ఎప్పుడు వస్తుందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమట. అయితే భూకంపం వస్తుందన్నే విషయాన్ని మాత్రం చెప్పడానకి కొన్ని మార్గాలున్నాయట..! నిజానికి భూమి లోపల ఎక్కడ ఒత్తిడి పెరుగుతుందో గుర్తించేందుకు రాతి పొరల కదలికలను శాస్త్రవేత్తలు గమనిస్తూ ఉంటారు. ఆ పరిశీలన ఆధారంగా ఆఖరి నిమిషంలో భూకంప హెచ్చరికలు జారీ చేసే వీలుంటుంది. అయితే భూమిలో పొరలను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాన్ని అంచనా వేయగలరట. కానీ ఇదే రోజు, ఇదే నెల, ఇదే సంవత్సరం.. ఇదే టైమ్‌లో వస్తుందని మాత్రం చెప్పాలేరట.

First published:

Tags: Earth quake, Turkey

ఉత్తమ కథలు