Home /News /trending /

REPUBLIC DAY 2022 FLYPAST FROM RAFALE COCKPIT VIEW TO DRONE SHOW STUNNING FLYPAST CONCLUDES RAJPATH PARADE SPECTACLE MKS

Viral Video: రఫ్ఫాడించిన రాఫెల్.. అదరగొట్టిన ఫార్మేషన్లు.. Republic Day 2022 పరేడ్ హైలైట్స్

రిపబ్లిక్ డే పరేడ్ లో వాయిసేన విన్యాసాలు

రిపబ్లిక్ డే పరేడ్ లో వాయిసేన విన్యాసాలు

భారత 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా ముగిశాయి. చివర్లో నిర్వహించన ఫ్లైపాస్ట్(వాయుసేన విన్యాసాలు) అందరినీ అబ్బురపర్చాయి. కొవిడ్ ఆంక్షలు, కట్టుదిట్టమైన భద్రత నడుమ దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద పరేడ్ ఆద్యంతం కన్నులపడువలా సాగింది.

భారత 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా ముగిశాయి. కొవిడ్ ఆంక్షలు, కట్టుదిట్టమైన భద్రత నడుమ దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద పరేడ్ ఆద్యంతం కన్నులపడువలా సాగింది. త్రివిధ దళాల ప్రదర్శన భారత శక్తి పాటవాలను చాటగా, వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా నిలిచింది. పరేడ్ చివర్లో నిర్వహించన ఫ్లైపాస్ట్(వాయుసేన విన్యాసాలు) అందరినీ అబ్బురపర్చాయి. ఇటీవలే భారత అమ్ములపొదిలో చేరిన రాఫెల్ యుద్ధవిమానం కాక్ పిట్ వ్యూను రాజ్ పథ్ ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించారు. పలు యుద్ధవిమానాలు రకరకాల ఫార్మేషన్లలో అద్భుత ప్రదర్శన చేశాయి..

రిపబ్లిక్ డే పరేడ్ ముగింపు నేపథ్యంలో నిర్వహించిన వాయుసేన విన్యాసాలు మొత్తం ఈవెంట్ కు హైలైట్ గా నిలిచాయి. రాఫెల్, జాగ్వర్, హెర్క్యూలెస్, సుఖోయ్ యుద్ధ విమానాలతో కూడిన ఫ్లైపాస్ట్ అత్యద్భుతంగా సాగింది.



యుద్ధ విమానాలు రకరకాల ఫార్మేషన్లతో అతిథులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. తొలిసారిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏకంగా 75 విమానాలు ఈ విన్యాసంలో పాల్గొన్నాయి. సైనిక రవాణాకు వాడే సీ-130 జే సూపర్ హెర్క్యూల్స్ ను కూడా పరేడ్ లో ప్రదర్శించారు. విమానం కాక్ పిట్ లో కెమెరాలు అమర్చి, కొత్త కోణాల్లో విన్యాసాలు చూపించారు.



ఒక రాఫెల్, రెండు జాగ్వార్ లు, రెండు మిగ్ 29, రెండు సుఖోయ్ లతో బాజ్ ఫార్మేషన్ చేపట్టారు. బాణం ఆకారంలో యుద్ధ విమానాలు దూసుకుపోతుంటే ఆ దృశ్యాలు చూసి జనం కేరింతలు కొట్టారు. మెన్ ఇన్ బ్లూగా పిలిచే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలగాలు అత్యద్భుత ప్రదర్శన ఇచ్చారు.



ఒక ఏఈడబ్ల్యూ, రెండు మిగ్, రెండు సుఖోయ్ విమానాలతో నేత్రా ఫార్మేషన్ చేశారు. అలాగే 17 జాగ్వార్లతో అమృత ఫార్మేషన్ చేసి చూపించారు. పరేడ్ చివర్లో నిర్వహించిన వాయిసేన ప్రదర్శన పరేడ్ మొత్తంలో హైలైట్ గా నిలిచింది.



అంతకుముందు, దేశవ్యాప్త పోటీల నుంచి ఎంపిక చేసిన 480 బృందాలతో సాంస్కృతిక ప్రదర్శనలు చేశాయి. వివిధ కమెరాల్లో షూట్ చేసిన పరేడ్ దృశ్యాలను రాజ్‌పథ్‌ మార్గంలో ఉంచి ఎల్ఈడీ తెరలపై ప్రదర్శించారు.



ఈ యేడాది నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పంజాబ్‌కు చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఈ శకటాన్ని రూపొందించారు. స్వాతంత్ర్యయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ప్రధానంగా పేర్కొంటూ పంజాబ్‌లో స్వాతంత్ర్య పోరాట కాలం నాటి సందర్భాలను వివరించే విధంగా ఈ శకటాన్ని రూపొందించారు.



1971 యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించిన సెంచూరియన్ ట్యాంక్, PT-76 ట్యాంక్‌ను భారత సైన్యం ప్రదర్శించింది దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదికి 75ఏళ్లు పూర్తికానుంది. ఈ సందర్భంగా 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే 73వ గణతంత్ర వేడుకల్లో పలు ప్రత్యేకతలు చోటుచేసుకుంటున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Delhi, Republic Day 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు