హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

China: డ్రాగన్ కంట్రీ దుస్సాహసం..లేజర్ వెపన్స్‌తో అంతరిక్షానికి గురి

China: డ్రాగన్ కంట్రీ దుస్సాహసం..లేజర్ వెపన్స్‌తో అంతరిక్షానికి గురి

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

China:ప్రపంచదేశాలతో కయ్యానికి కాలు దువ్వే చైనా ఇప్పుడు ఏకంగా అంతరిక్షానికి గురి పెట్టింది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి లేజర్ వెపన్స్‌ తయారు చేయించి ఉపగ్రహాలను ధ్వంసం చేయడానికి పక్కా ప్రణాళిక రచిస్తోందని తైవాన్ న్యూస్ వెల్లడించింది.

ఇంకా చదవండి ...

ఆయుధాల తయారిలో చైనా (China)మరో అండుగు ముందుకేసింది. ఏకంగా అంతరిక్షం(Space)లో ఉపగ్రహాల(Satellites)ను ధ్వంసం చేయగలిగిన లేజర్‌ ఆయుధాన్ని(Laser weapons) తయారు చేసినట్లుగా అంతర్జాతీయ మీడియా తెలిపింది. అంతరిక్షంలోని జామ్ నాశనం చేయగల మైక్రోవేవ్ మెషీన్ "రిలేటివిస్టిక్ క్లిస్ట్రాన్ యాంప్లిఫైయర్ (RKA)ని చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. చైనా తయారు చేసిన ఈ అత్యాధునిక లేజర్‌ వెపన్‌ Ka-బ్యాండ్‌లో 5-మెగావాట్ల కొలిచే వేవ్ బర్స్ట్‌ను ఉత్పత్తి చేయగలదు. విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్‌లో కొంత భాగం పౌర, సైనిక ప్రయోజనాల కోసం ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఆసియా టైమ్స్‌ కథనాన్ని ఉటంకిస్తూ తైవాన్ న్యూస్ ఈ విషయాన్ని నివేదించింది. భూమి లేదా ఆకాశం నుండి ఉపగ్రహాలను గురి చూసి కాల్చేంత శక్తివంతమైనది కాకపోయినప్పటికి రిలేటివిస్టిక్ క్లిస్ట్రాన్ యాంప్లిఫైయర్ ఉపగ్రహాలపైకి దూసుకెళ్లేలా పని చేస్తుంది. ఇది ఉపగ్రహాల్లోని అత్యంత సున్నితమైన ఎలక్ట్రానిక్ వ్యవస్థను నాశనం చేయడంతో పాటు అంతరిక్షంలో శత్రువుల ఆస్తులపై దాడి చేయడానికి ఉపయోగించబడుతుంది.డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ అనేది భౌతిక సంఘర్షణలో శత్రు పరికరాలు లేదా సిబ్బందిని దెబ్బతీయడానికి లేదా నాశనం చేయడానికి గతి శక్తి కంటే కేంద్రీకృత విద్యుదయస్కాంత శక్తిని ఉపయోగించే వ్యవస్థగా పని చేస్తుంది. RKA ఒక డైరెక్ట్ ఎనర్జీ వెపన్ (DEW) అని చైనా ఖండించినప్పటికీ, సిస్టమ్ స్కేల్‌లో నిర్మించబడితే, వేగంతో కదులుతున్న లోహ పదార్థాలను చీల్చివేసేంత బలమైన కిరణాలను పంపగలదని తైవాన్ న్యూస్ నివేదించింది. చైనా తయారు చేసిన లేజర్‌ వెపన్ సాంకేతికంగా అధిక శక్తితో కూడిన ఆయుధంగా పని చేయగలదని బీజింగ్‌కు చెందిన ఒక అంతరిక్ష శాస్త్రవేత్త మీడియాతో రహస్యంగా చెప్పినట్లు సమాచారం.

చైనా దుస్సాహసం ..

చైనా ఆలోచన విధానం, అనుసరిస్తున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో అంతరిక్షం కూడా తీవ్ర వివాదాస్పద భౌగోళిక రాజకీయరంగంగా మారుతుందనే సందేహాన్ని అంతర్జాతీయ మీడియా భావిస్తోంది. గత ఏడాది ఆగస్టులో తక్కువ కక్ష్యలో ప్రయాణించిన అణు సామర్థ్యం గల హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనాన్ని ప్రయోగించినట్లు చైనా ఇటీవల వెల్లడించింది. నవంబర్‌లో ఈ వార్తలపై స్పందిస్తూ వాషింగ్టన్‌లోని థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) సీనియర్ ఫెలో థామస్ కరాకో, చైనా సైన్యం యొక్క కొత్త క్షిపణులను ఎదుర్కోవడానికి US అంతరిక్ష ఆధారిత సెన్సార్‌లను మోహరించాల్సిన అవసరం ఉందని తైవాన్ నివేదించింది.

అంతరిక్షంపై పడ్డ చైనా కన్ను..

ముఖ్యంగా ఉక్రెయిన్‌, రష్యా యుద్ధవాతావరణ పరిస్థితుల్ని చూస్తుంటే అంతరిక్షంతో పాటు ఉపగ్రహాలకు ప్రమాదం కలిగే పరిస్థితి కనిపిస్తోంది. కొన్నేళ్లుగా రష్యా, విదేశాల మధ్య అంతరిక్షంలో చేసుకుంటున్న పరస్పర సహకారం నిలిచిపోయే పరిస్థితి లేకపోలేదు.

First published:

Tags: China, Space

ఉత్తమ కథలు