Video: గాడిదతో రిపోర్టర్ ఇంటర్వ్యూ... ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వీడియో...

ఓ రిపోర్టర్ ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిని ఆధారంగా చేసుకుని చేసిన ఇంటర్వ్యూ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.

news18-telugu
Updated: July 22, 2020, 5:34 PM IST
Video: గాడిదతో రిపోర్టర్ ఇంటర్వ్యూ... ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వీడియో...
గాడితో రిపోర్టర్ ఇంటర్వ్యూ
  • Share this:
ప్రస్తుతం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్‌లో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ రిపోర్టర్ ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిని ఆధారంగా చేసుకుని చేసిన ఇంటర్వ్యూ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఆ ఇంటర్వ్యూ లో రిపోర్టర్ చూపిన వ్యంగ్యం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ విషయానికి వస్తే ఓ రిపోర్టర్ మాస్క్ పెట్టుకోవాల్సిన ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ఈ వీడియో తీశాడు. ఆ ఇంటర్వ్యూలో రోడ్డు మీద కూర్చున్న ఓ గాడిద వద్దకు వెళ్లిన రిపోర్టర్.. ఇక్కడ ఎందుకు కూర్చున్నావని ప్రశ్నిస్తాడు. అలాగే, మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని అడుగుతాడు. ఆ తర్వాత రోడ్డు మీద మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్న వ్యక్తులను పట్టుకుని వారిని ప్రశ్నిస్తాడు. గాడిదలు కూడా రోడ్డు మీద మాస్క్‌లు పెట్టుకోకుండా తిరుగుతున్నాయి. అలాగే, మాస్క్ లు పెట్టుకోకుండా తిరిగేవాళ్లు కూడా గాడిదలే అన్నట్టుగా సాగిన ఈ ఇంటర్య్యూను అమిత్ కుమార్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు.



ఒకరిద్దరితో కాకుండా ఆ మార్గంలో వెళ్లిన మరికొందరితో కూడా రిపోర్టర్ మాట్లాడాడు. మాస్క్ పెట్టుకోవడం ప్రాధాన్యాన్ని అందరికీ వ్యంగంగా తెలియజేశాడు. ఈ వీడియో బాగా వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ రిపోర్టర్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. కొత్త సమస్యలకు కొత్త రకం పరిష్కారాలు అంటూ ఓ నెటిజన్ స్పందిస్తే.. సుతిమెత్తగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాడంటూ మెచ్చుకుంటున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 22, 2020, 5:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading