కోవిడ్ అనంతరం భారత గృహ రంగం బలంగా మారనుందా..!

కరోనా మహమ్మారి ప్రభావానికి ప్రపంచమంతా అతలాకుతలమైంది. వ్యాపారాలు నిలిచిపోయాయి, చదువులు, ఉద్యోగాలు, రవాణా, సేవలు అన్ని స్తంభించాయి. వాణిజ్యరంగమైతే కుదేలైంది.

news18-telugu
Updated: September 20, 2020, 7:48 AM IST
కోవిడ్ అనంతరం భారత గృహ రంగం బలంగా మారనుందా..!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా మహమ్మారి ప్రభావానికి ప్రపంచమంతా అతలాకుతలమైంది. వ్యాపారాలు నిలిచిపోయాయి, చదువులు, ఉద్యోగాలు, రవాణా, సేవలు అన్ని స్తంభించాయి. వాణిజ్యరంగమైతే కుదేలైంది. కోవిడ్-19 ప్రభావంతో భారత్ లో వ్యాపార రంగం బాగా దెబ్బతింది. ఇందుకు రియల్ ఎస్టేటు సెక్టారేమి మినాహాయింపు కాదు. అయితే రాబోయే సంవత్సరాల్లో రియల్ ఎస్టేటు రంగం పుంజుకుంటుందని కొన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి.

మార్చి నుంచి అమ్మకాలు నిలిచిపోయాయి..

ఇందులో నిర్మాణాత్మక మార్పులు, విధానపరమైన సంస్కకరణలు 2016 చివరి నుంచి ప్రారంభించారు. అయినప్పటికీ మార్కెట్లో కార్యచరణ బాగున్నప్పటికీ సప్లయి, డిమాండ్ 2014లో వచ్చిన గరిష్ఠ స్థాయిని చేరుకోలేదు. ఏదైనప్పటికీ 2018 మధ్యార్థంలో సంభవించిన ద్రవ్య సంక్షోభం వృద్ధిని గణనీయంగా ప్రభావితం చేసింది. 2019 రెండో అర్థభాగం నాటి అమ్మకాలు మందగించాయి. చివరికి 2020 మార్చిలో లాక్ డౌన్ విధించడంలో పూర్తిగా నిలిచిపోయాయని ఎఫ్ఐసీసీఐ-ఏఎన్ఏఆర్ఓసీకే నివేదిక తెలిపింది.

2012 నుంచి 2019 వరకు దేశవ్యాప్తంగా 7 నగరాల్లో సగటున ధరలు నెమ్మదిగా 3 శాతం పెరిగాయి. ఈ పెరుగుదల ద్రవ్యోల్బణ రేటు కంటే తక్కువ. ఫలితంగా ఈ వృద్ధి గృహాలు కొనుగోలు దారులకు మంచి అవకాశంగా పరిగణించవచ్చు. అంతేకాకుండా హోమ్ లోన్ తీసుకునే నిష్పత్తి కూడా గత కొన్నేళ్లుగా తగ్గుతుంది. పారిశ్రామిక నిపుణుల ప్రకారం భారత నగరాల్లో మధ్య ఆదాయం గల అపార్ట్ మెంట్ ఈ ఆర్థిక సంవత్సరంలో 27 శాతం ఉండనుందని పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాల్లో ఇదే అత్యల్పం.

ధర ఎక్కువైనా వారి వద్దే కొనుగోలు చేస్తున్నారు..
మొత్తం సేల్స్ తగ్గుతుంటే కొంతమంది లిస్టెడ్ డెవలపర్ల అమ్మకాలు మాత్రం పెరుగుతున్నాయి. ఎక్కువ మంది గృహాల కొనుగోలు దారుల బ్రాండెడ్ డెవలపర్ల కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఏఎన్ఏఆర్ఓసీకే పరిశోధన ప్రకారం వినియోగదారుల సర్వేలో 62 శాతం మంది గృహాల కొనుగోలుదారులు బ్రాండెడ్ డెవలర్లపర్ల దగ్గర కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ధర కాస్త ఎక్కువైనా వారి వద్దే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.

ఇందుకు కారణం డెవలపర్లు మారుతున్న మార్కెట్ పరిస్థితుల గురించి స్పష్టంగా తెలుసుకుని అధిక సరఫరా సృష్టించడానికి లాంచ్ లను నియంత్రించారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్పందించే ఈ అనుకూలత ఈ రంగం వృద్ధికి దోహదపడింది. రాబోయే ఏళ్లలో బలమైన ఆవిర్భావంతో ముందుకు వెళ్లే అవకాశముంది.నిర్మాణాత్మక మార్పులు, విధానపరమైన సంస్కరణలు ప్రయోగాల మధ్య సరఫరా 2013 లో 0.69 నుంచి 2020 నాటికి 1.36కు మెరుగుపడింది. భవిష్యత్తులో ఈ రంగం వృద్ధికి శుభ సూచికగా ఉంటుంది.ప్రభుత్వం మద్దతు..
కరోనా ప్రభావం తర్వాత ప్రభుత్వం వడ్డీ రేట్లను తగ్గంచడంతో ద్రవ్యత్వాన్ని పెంచనుంది. అంతేకాకుండా కీలకమైన సహాయకారి ఉంది. మహమ్మారి నుంచి బయట పడేందుకు సలహాప్రాయంగా ఉండటమే కాకుండా కొన్ని కీలక చర్యలు తీసుకుంది. ఎస్డబ్ల్యూఏఎంఐహెచ్ ఫండ్ అమలులో ఉంది. 25 వేల కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని 2019లో ఏర్పాటు చేసింది. తాజాగా రూ.10,284 కోట్లను మంజూరు చేసింది. ఇవి కాకుండా లోన్ మోరోటిరియం, లోన్ రీస్ట్రక్చరింగ్, రెరా లాంటి పథకాల ద్వారా సాయం చేస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని తగ్గించింది. ఇవికాకుండా ఏఆర్హెచ్సీ స్కీమును ప్రవేశపెట్టింది.
Published by: Sumanth Kanukula
First published: September 20, 2020, 7:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading