Corona Tests: కరోనా పరీక్షలు చేస్తున్న రోబో.. ఇంకా ఎలాంటి సేవలు అందిస్తుందో తెలిస్తే షాకే..

రిమోట్ కంట్రోల్ తో పనిచేసే Cira-03 అనే ఈ రోబోట్ రోగుల టెంపరేచర్ చెక్ చేసి, కరోనా టెస్టులు కూడా చేస్తోంది. ఈజిప్టు (Egypt) రాజధాని కైరోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ రోబో వైద్యసేవలు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేవడం అందరినీ ఆకట్టుకుంటోంది.

news18-telugu
Updated: November 26, 2020, 5:36 PM IST
Corona Tests: కరోనా పరీక్షలు చేస్తున్న రోబో.. ఇంకా ఎలాంటి సేవలు అందిస్తుందో తెలిస్తే షాకే..
రోగికి సేవలు అందిస్తున్న రోబో
  • Share this:
రిమోట్ కంట్రోల్ తో పనిచేసే Cira-03 అనే ఈ రోబోట్ రోగుల టెంపరేచర్ చెక్ చేసి, కరోనా టెస్టులు కూడా చేస్తోంది. ఈజిప్టు (Egypt) రాజధాని కైరోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ రోబో వైద్యసేవలు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేవడం అందరినీ ఆకట్టుకుంటోంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కేర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. పలు ఆస్పత్రులు, ల్యాబరేటరీల్లో రోబో సేవలను అందుబాటులోకి తేవడం రొటీన్ గా మారుతోంది. రోగులను పర్యవేక్షించటం, ఆస్పత్రి పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటూ, మెడికల్ వర్కర్స్ కు సాయం చేయడం వంటి అంశాల్లో రోబోల సేవలు మరింత విస్తృతమవుతున్నాయి. మొత్తానికి వైద్య సేవల్లో రోబోల సైన్యం చాలా అత్యవసరంగా కోవిడ్-19 పరిస్థితులను మార్చేసింది.

అన్ని Tests చేస్తుంది..

సిరా-03 అనో రోబోను రూపొందించిన ఈజిప్షియన్ ఇన్వెంటర్ కోవిడ్ పరీక్షలు చేసేలా డిజైన్ చేశారు. ఇక ఆస్పత్రిలో ఎవరైనా మాస్కు వేసుకోలేదంటే వారిని గుర్తించి, అటువంటి వారికి వార్నిగ్ కూడా ఇచ్చే బాధ్యతను ఈ రోబో అద్భుతంగా నిర్వర్తిస్తోంది. మనిషి లాంటి ముఖం ఉన్న ఈ రోబోకు రోబోటిక్ చేతులున్నాయి. బ్లడ్ టెస్ట్, ఎకో కార్డియోగ్రామ్స్, ఎక్-రే, వంటి పరీక్షలు చేసేలా ఈ రోబోను డిజైన్ చేశారు. స్వాబ్ (swab) పరీక్షలు చేయటానికి ఈ రోబో సేవలు అత్యద్భుతంగా పనికి వస్తాయని వైద్య సిబ్బంది వివరిస్తున్నారు. ఈ పరీక్షలు చేసే క్రమంలో వైరస్ కు ఎక్స్ పోజ్ కాకుండా వైద్య సిబ్బందిని కాపాడేందుకు రోబోలే చక్కని ప్రత్యామ్నాయం.

మనిషిని పోలినట్టే ఎందుకు?
మనిషిని పోలినట్టున్న రోబోను డిజైన్ చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం, రోగులు దీన్ని చూసి భయపడి, ఏమాత్రం బెదిరకుండా ఉండేందుకే అని చెబుతున్నారు. దీన్ని రూపొందించిన మహమ్మద్ ఎల్ కోమీ మాట్లాడుతూ.. ఏదో బాక్స్ లా తమవద్దకు వచ్చి పరీక్షలు జరిపే రోబోలా ఉండరాదనేది తన లక్ష్యం అని చెప్పారు. రోగులు ఈ రోబోను చూసి పాజిటివ్ గా స్పందిస్తున్నారని, ఏమాత్రం భయపడటం లేదని కోమీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పైపెచ్చు మనుషుల కంటే రోబోలు ఎక్కువ కచ్ఛితత్వంతో పనిచేస్తాయి కాబట్టి రోగులు దీనిపై ఎక్కువ నమ్మకం చూపుతుండటం విశేషం. రేయింబవళ్లు ఇవి డ్యూటీలో ఉంటాయి కనుక రోబోలపై ఆధారపడడం ఆస్పత్రి యాజమాన్యానికి చాలా ఈజీగా ఉంటుంది.

ఇక వీటిని అవసరమైన రూపంలో డిజైన్ చేయించుకునే సౌలభ్యం ఉంది. తమకు కావాల్సిన వైద్య సేవల జాబితాను ఇస్తే రోబో రూపకర్తలు ఆయా సాఫ్ట్ వేర్ ను అందులో పొందుపరుస్తారు. దీనికి అనుగుణంగా రోబో సర్వీసులు ఉంటాయి. మరోవైపు హోటల్ ఇండస్ట్రీలో కూడా ఇటీవలి కాలంలో రోబోల సేవలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కరోనా వైరస్ సోకేందుకు ఆస్కారం లేని సేవలు తాము కల్పిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న రెస్టారెంట్లు రోబోలను ప్రత్యేక ఆకర్షణగా మార్చుతున్నారు. కరోనా కారణంగా ఆస్పత్రి, రెస్టారెంట్లలో పనిచేసే ఉద్యోగులు ఇంటికే పరిమితమవుతుండగా మానవ వనరుల కొరత కూడా ఇలాంటి చోట్ల పెద్ద సమస్యగా మారుతోంది. కోవిడ్ 3rd wave సమస్యను ఎదుర్కొంటున్న దేశాల్లో అయితే మానవ వనరుల కొరత పెద్ద సమస్యగా మారుతోంది.
Published by: Nikhil Kumar S
First published: November 26, 2020, 5:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading