గల్ఫ్ గోస.. రంజాన్ తర్వాత స్వదేశానికి కరీంనగర్ వాసి..

వీరయ్య బంధువులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన విదేశాంగ అధికారులు అతడి యజమానితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. దీంతో రంజాన్ తర్వాత వీరయ్యను భారత్‌కు పంపేందుకు రంగం సిద్ధమైంది.

news18-telugu
Updated: May 10, 2019, 9:44 AM IST
గల్ఫ్ గోస.. రంజాన్ తర్వాత స్వదేశానికి కరీంనగర్ వాసి..
బాధితుడు (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
పొట్టకూటికి అబుదాబి వెళ్లి అష్టకష్టాలు పడుతున్న కరీంనగర్ వాసికి కష్టాలు తీరనున్నాయి. ‘ఎడారి దేశంలో అరిగోస పడుతున్నా.. ’ అంటూ తన బాధను వీడియో ద్వారా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మొర పెట్టుకున్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్యకు గల్ఫ్ సంకెళ్ల నుంచి విముక్తి లభించనుంది. వీరయ్య బంధువులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన విదేశాంగ అధికారులు అతడి యజమానితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. దీంతో రంజాన్ తర్వాత వీరయ్యను భారత్‌కు పంపేందుకు రంగం సిద్ధమైంది. అతడి ఎగ్జిట్ వీసాకు సంబంధించిన పనులు కూడా పూర్తయినట్లు సమాచారం. కాగా, త్వరితగతిన స్పందించి వీరయ్యను యజమాని చెర నుంచి విడిపించినందుకు విదేశాంగ అధికారులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అటు వీరయ్యను తీసుకొచ్చేందుకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు సమాచారం.

కాగా, వీరయ్య ‘సార్‌..నన్ను ఒంటెల వద్ద ఉంచుతున్నరు. మా యజమాని వద్ద వంద ఒంటెలు ఉన్నయ్. వాటిని నేనొక్కడినే చూసుకోవాలె. పొట్టుపొట్టు కొట్టిండు. దవడపై కొట్టడంతో ఏం మాట్లాడలేకపోతున్న. దయచేసి నేను మన దేశం వచ్చేటట్టు చూడుర్రి. ఒంటెల్లో ఒక ఒంటె చనిపోవడంతో యజమాని చావగొట్టిండు. మాది కరీంనగర్‌ జిల్లా తుమ్మాపురం మండలం. మేం గరీబోళ్లం. నా అవతారం, పరిస్థితి చూడుర్రి. అబుదాబికి వచ్చి రెండేళ్లు అయితుంది. అబుదాబికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటున్నం. ఇక్కడ కరెంట్‌ కూడా ఉండది. ఎట్లా సార్? ఏం చేయమంటరు? మా అమ్మ చనిపోతే అగ్గి పెట్టడానికి కూడా పంపలేదు. దయచేసి నేను ఇంటికి వచ్చేలా చూడుర్రి. ఎంత పని చేసినా మాకు సరిగ్గా తిండి పెడ్తలే. నా కుమారులు, భార్య హాస్పిటల్‌లో ఉన్నరు. వాళ్లను చూడటానికి కూడా నన్ను పంపుతలేరు’ అని వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఇది చదవండి:

ఎడారి దేశంలో అరిగోస పడుతున్నడు.. కరీంనగర్ వాసి నరకం చూస్తున్నడు..
First published: May 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>