మార్కెట్ రారాజు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ విజయ ప్రస్థానం సాగిందిలా..

Reliance Industries Rs.10 Lakh Crore Market Captial : అద్భుతం.. అమోఘం.. అద్వితీయం.. దేశ చరిత్రలో సరికొత్త రికార్డు ఇది.. భారత మార్కెట్ సగర్వంగా తలెత్తుకునే సందర్భం ఇది.. రూ.10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటల్‌ను దాటి రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంగొత్త చరిత్ర సృష్టించింది.

news18-telugu
Updated: November 28, 2019, 12:28 PM IST
మార్కెట్ రారాజు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ విజయ ప్రస్థానం సాగిందిలా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Reliance Industries Rs.10 Lakh Crore Market Captial : అద్భుతం.. అమోఘం.. అద్వితీయం.. దేశ చరిత్రలో సరికొత్త రికార్డు ఇది.. భారత మార్కెట్ సగర్వంగా తలెత్తుకునే సందర్భం ఇది.. రూ.10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటల్‌ను దాటి రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంగొత్త చరిత్ర సృష్టించింది. ఈ మార్కును టచ్ చేసి భారత దేశంలోనే అతి పెద్ద కంపెనీగా మరోసారి కాలర్ ఎగరేసింది. ఏ కంపెనీకి సాధ్యం కాని రీతిలో కంపెనీ షేర్ రూ.1581.25కు చేరడం మరో ఘనత. ఈ నెల 21న ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద ఇంధన కంపెనీగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు ఉదయం 10 గంటలకు రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్‌ను దాటింది. డాలర్ విలవలో చూస్తే ఈ కంపెనీ విలువ 140 బిలియన్ డాలర్లు. జియో, రిలయన్స్ రిటైల్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఏడాది కాలంలో 31 శాతం వృద్ధిని సాధించింది.

మార్కెట్ రారాజుగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొంత కాలంగా అద్వితీయ విజయ ప్రస్థానాన్ని కొనసాగించింది. ఏ కంపెనీకి సాధ్యం కానంతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ శిఖరాగ్రానికి చేరుకుంది. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ప్రతి సందర్భంలో అబ్బురపరిచే ఫలితాలను అందుకుంది. ఓసారి RIL ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. 40 రోజుల్లోనే రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటల్‌ను సాధించింది. అక్టోబరు 18న రూ.9 లక్షల కోట్ల వద్ద ఉండగా అది.. ఈ రోజుకు రూ.10 లక్షల కోట్లకు చేరుకుంది.

సందర్భం మార్కెట్ క్యాపిటలైజేషన్
నవంబరు 2019---రూ. 10 లక్షల కోట్లు
అక్టోబరు 2019---రూ. 9 లక్షల కోట్లు
మార్చి 2019---రూ. 8 లక్షల కోట్లు
జూలై 2018---రూ. 7 లక్షల కోట్లుజనవరి 2018---రూ. 6 లక్షల కోట్లు
సెప్టెంబరు 2017---రూ. 5 లక్షల కోట్లు

తేదీ                               సీఎంపీ        మార్కెట్ క్యాపిటల్       వ్యవధి

(కోట్లలో)
02 ఆగస్టు 2005      93.57            103321

16 ఏప్రిల్ 2007       364.44         203138                               424

19 సెప్టెంబరు 2007 543              302935                             110

29 అక్టోబరు 2007      707              411078                               28

21 జూలై 2017              793              515400                             2410

01 నవంబరు 2017     953             603207                             70

19 జూలై 2018             1105            700089                            180

23 ఆగస్టు 2018           1270            804533                            24

24 అక్టోబరు 2019       1437            910587                            285

28 నవంబరు 2019    1580            10,00,000                     25
Published by: Shravan Kumar Bommakanti
First published: November 28, 2019, 12:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading