మరో 4 సంస్థలతో రిలయన్స్ భారీ డీల్స్... రూ.30,062 కోట్లు రాక...

ఎక్కు పైమెట్టు... కొట్టు... కొండను ఢీ కొట్టు... అన్నట్లుగా... రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకుపోతోంది. మరిన్ని డీల్స్ కుదుర్చుకొని ఆదాయం పెంచుకుంటోంది.

news18-telugu
Updated: July 11, 2020, 1:09 PM IST
మరో 4 సంస్థలతో రిలయన్స్ భారీ డీల్స్... రూ.30,062 కోట్లు రాక...
మరో 4 సంస్థలతో రిలయన్స్ భారీ డీల్స్... రూ.30,062 కోట్లు రాక...
  • Share this:
రిలయన్స్ జియోలో వాటాను ఫేస్‌బుక్‌కి అమ్మి... భారీగా ఆదాయాన్ని సమకూర్చుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్... ఈ మధ్య వరుసగా డీల్స్ కుదుర్చుకుంటోంది. తాజాగా మరో నాలుగు సంస్థలకు కొద్దిపాటి వాటాలను అమ్మి... రూ.30062 కోట్లకు పైగా రాబట్టింది. తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ ఏమందంటే... జియో ప్లాట్‌ఫామ్స్‌లో 6.13 శాతం వాటాను L కాట్టెర్టన్, ది పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, సిల్వర్ లేక్, జెనరల్ అట్లాంటిక్ కంపెనీలకు అమ్మినట్లు తెలిసింది. రిలయన్స్... జియోలో 25.09 శాతం వాటాను 11 పెట్టుబడి సంస్థలకు అమ్మి... రూ.1,17,588.45 కోట్లు రాబట్టింది. దేశంలో చాలా కంపెనీలతో పోల్చితే.. జియో వయసు చాలా తక్కువ. కానీ... దేశంలోనే అతి పెద్ద టెలికం సంస్థగా అది ఆవిర్భవించింది.

ఇంతకుముందు రిలయన్స్... ఫేస్‌బుక్‌కి చెందిన సబ్సిడరీ సంస్థ జాదూ హోలిండ్స్, LLCలతో డీల్ కుదుర్చుకొని... రూ.43,574 కోట్లు సంపాదించింది. జులై 7న జాదూ హోలిండ్స్‌తో కుదిరిన డీల్ వల్ల... ఆ సంస్థ... జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం ఈక్విటీ షేర్లను పొందింది.

ఇప్పుడు... L కాట్టె్ర్టన్ రూ.1894.50 కోట్లు చెల్లించి... జియో ప్లాట్‌ఫామ్స్‌లో 0.39 శాతం వాటాను దక్కించుకుంది. ది పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట ఫండ్ రూ.11,367 కోట్లు చెల్లించి... 2.32 వాటాను పొందింది. సిల్వర్ లేక్ యూనిట్స్ అయిన SLP రెడ్ వుడ్ హోల్డింగ్స్, SLP రెడ్ వుడ్ కో ఇన్వెస్ట్ (DE)... 2.08 శాతం వాటాను పొంది... రూ.10,202.55 కోట్లు చెల్లించాయి. ఇక జనరల్ అట్లాంటిక్ సింగపూర్ JP... రూ.6598.38 కోట్లకు... 1.34 శాతం వాటా దక్కించుకుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్ట్ ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకారు.వారెన్ బఫెట్‌ను దాటడం ద్వారా ముఖేష్ అంబానీ ఈ ఘనతను సాధించారని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకటించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 68.3 బిలియన్ డాలర్లుగా ఉంది. వారెన్ బఫెట్ సంపద 67.9 బిలియన్ డాలర్లు (జూలై 9 నాటికి) అని బ్లూంబర్గ్ ప్రకటించింది. 2020లో ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. కానీ, ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మాత్రం 21.63 శాతం వృద్ధి చెందాయి. అలాగే, జియో ప్లాట్ ఫాంలో 25.09 శాతం షేర్లను విక్రయించడం ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులను రిలయన్స్ ఇండస్ట్రీస్ పొందింది. జియో ప్లాట్ ఫాంల్లో ఫేస్ బుక్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్టనర్స్, కేకేఆర్ ముబదాలా ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ, ఏడీఐఏ, టీపీజీ క్యాపిటల్, ఎల్ కాటర్‌టన్, పీఐఎఫ్, ఇంటెల్ క్యాపిటల్ వంటి సంస్థలు జియోలో వాటాలను కొనుగోలు చేశాయి.
Published by: Krishna Kumar N
First published: July 11, 2020, 1:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading