RECORD BID FOR ARMANDO PIGEON SOLD FOR RS 10 CRORES IN AUCTION SS
ఆ పావురం ధర రూ.10 కోట్లు... ఎందుకో తెలుసా...
పావురం ధర రూ.10 కోట్లు... (Image: PIPA)
అర్మాండో పావురం వయస్సు ఐదేళ్లు. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉంది. అయినా ఇంత ధర పలకడం ఆశ్చర్యకరం. ఆ పావురం రెక్కల్లో అసాధారణమైన బలం, వేగంగా దూసుకెళ్లే తత్వం ఇందుకు కారణం.
ఓ పావురం ధర ఎంతుంటుంది? వందల్లో లేదా వేలల్లో ఉంటుంది. కానీ ఓ పావురం ధర రూ.10 కోట్లు. అవును... అక్షరాలా పది కోట్ల రూపాయలు. షాకయ్యారా? ఇది నమ్మి తీరాల్సిందే. అది బెల్జియంకు చెందిన పావురం. పేరు అర్మాండో. బెల్జియంలో లాంగ్ డిస్టెన్స్ రేస్‌లో అత్యంత వేగంగా లక్ష్యాన్ని చేరుకున్న పావురం ఇది. ఈ పావురంపై ఇద్దరు చైనీయులు మనసుపారేసుకున్నారు. సొంతం చేసుకుందామని అనుకున్నారు. అంతే... కోట్లు చెల్లించేందుకు సిద్ధపడ్డారు. చివరకు ఒకరు రూ.10 కోట్లకు వేలంపాటలో దక్కించుకున్నారు.
బెల్జియంలో పిజియన్ రేసింగ్ వెబ్సైట్ అయిన PIPA.be ప్రకారం అర్మాండో పావురాన్ని వేలం వేస్తే ఇద్దరు చైనీయులు తీవ్రంగా పోటీ పడ్డారు. మార్చి 17న ఓ గంట పాటు వేలంపాట సాగింది. వేలంపాట మొదట 6,00,000 డాలర్లకు చేరుకోగానే అంతా షాకయ్యారు. కానీ వేలంపాట అక్కడితో ఆగలేదు. ఇద్దరు చైనీయులు ఆ పావురాన్ని సొంతం చేసుకునేందుకు పోటాపోటీగా వేలంపాటలో పాల్గొన్నారు. చివరకు 14,00,000 మిలియన్ డాలర్ల దగ్గర వేలంపాట ఆగింది. 14,00,000 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.10 కోట్లు. అర్మాండో పావురం వయస్సు ఐదేళ్లు. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉంది. అయినా ఇంత ధర పలకడం ఆశ్చర్యకరం. ఆ పావురం రెక్కల్లో అసాధారణమైన బలం, వేగంగా దూసుకెళ్లే తత్వం ఇందుకు కారణం.
ఓ పావురం ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి. అంతకుముందు ఓ పావురం సుమారు రూ.3 కోట్లు పలికింది. ఈసారి మొత్తం 178 పావురాలను వేలం వేశారు. రూ.17 కోట్లు రావడం విశేషం. ఇప్పటివరకు నిర్వహించిన వేలంపాటల్లో ఇది మూడో అత్యధికం. పావురాలను కోట్లు కుమ్మరించి ఎందుకు సొంతం చేసుకుంటారని ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఆ పావురాలను పెంచేందుకు పడే కష్టం అంతా ఇంతా కాదు. సంక్రాంతి కోడి పందేలకు ఏడాదంతా కోళ్లను పోషించినట్టు... పావురాల రేస్‌కు వీటిని సిద్ధం చేస్తుంటారు. రోజూ 12 గంటల పాటు పావురాల కోసం సమయం కేటాయిస్తుంటారు పోషకులు. అందుకే ఈ పావురాలకు అంత విలువ.
Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.