• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • REAL LIFE SLEEPING BEAUTY 17 SPENDS WEEKS ON END ASLEEP WITHOUT WAKING UP MK GH

Sleeping Beauty: వారాల తరబడి నిద్రపోయే ‘స్లీపింగ్ బ్యూటీ’... సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ ఉంది!

Sleeping Beauty: వారాల తరబడి నిద్రపోయే ‘స్లీపింగ్ బ్యూటీ’... సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ ఉంది!

ప్రతీకాత్మకచిత్రం

సితి రైసా మిరండ అనే 17 ఏళ్ల టీనేజ్‌ యువతికి అత్యంత అరుదైన అనారోగ్య సమస్య ఉంది. దీనివల్ల ఆమె ఒక్కసారి పడుకుంటే.. వారాల తరబడి నిద్ర లేవదు. వ‌రుస‌గా 13 రోజుల పాటు నిద్ర‌లేవ‌కుండా ప‌డుకొనే ఉంటుంది.

  • Share this:
ఒక్కసారి పడుకుంటే అదేపనిగా నిద్రపోయేవారిని స్లీపింగ్ బ్యూటీ అంటారు. చాలా సినిమాలు, సిరీస్‌లలో ఇలాంటి పాత్రలను సృష్టించారు దర్శకులు. అంత పాపులారిటీ ఉన్న ‘స్లీపింగ్ బ్యూటీ’ రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ ఇండోనేషియాలో ఉంది. ఆ దేశానికి చెందిన సితి రైసా మిరండ అనే 17 ఏళ్ల టీనేజ్‌ యువతికి అత్యంత అరుదైన అనారోగ్య సమస్య ఉంది. దీనివల్ల ఆమె ఒక్కసారి పడుకుంటే.. వారాల తరబడి నిద్ర లేవదు. వ‌రుస‌గా 13 రోజుల పాటు నిద్ర‌లేవ‌కుండా ప‌డుకొనే ఉంటుంది. ప్రతి పదిలక్షల మందిలో ఒక‌రికి ఇలాంటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ వింత వ్యాధి ఉండే మ‌నుషుల్ని నిజ‌జీవితంలో చూడ‌టం క‌ష్ట‌మేగానీ, ఇలాంటి క్యారెక్ట‌ర్ అంత‌ర్జాతీయంగా చాలా మందికి సుప‌రిచిత‌మే. స్లీపింగ్ బ్యూటీ పేరుతో సినిమాల్లో, సాహిత్యంలో ఈ క్యారెక్ట‌ర్ విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది.

సితి రైసా మిరండ ఒక్కసారి నిద్ర‌పోతే, వారాల త‌ర‌బ‌డి మేల్కోలేదు. 2017లో ఈమెలో మొద‌టిసారి ఈ ల‌క్ష‌ణం క‌నిపించింది. అప్పుడు ఆమె ఇండోనేషియాలోని బంజ‌ర్‌మసిన్ ప్రాంతంలో ఉన్న త‌న ఇంట్లో 13 రోజుల పాటు ఏక‌ధాటిగా నిద్ర‌పోయింది. ఈ ప‌రిస్థితిని చూసి కంగారు ప‌డిన త‌ల్లిదండ్రులు సితిని హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లారు. ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు ఆమె క్లీన్-లెవిన్ సిండ్రోమ్ (Kleine-Levin Syndrome-KLS) బారిన ప‌డిన‌ట్లు నిర్థారించారు. ఇది ప‌ది ల‌క్ష‌ల మందిలో ఒక‌రికి ఉండే వ్యాధి అని చెప్పారు.

ఈ రుగ్మత బయటపడిన తరువాత నుంచి.. సితి నిద్రపోగానే ఆమె తల్లిదండ్రులు హాస్పిట‌ల్‌కు తీసుకువెళతారు. అక్క‌డ ఆమె క‌నీసం వారం పాటు నిద్ర‌పోతుంది. ఇలా నిద్ర‌పోతున్న స‌మ‌యంలో త‌న ఆరోగ్యం బాగానే ఉందో లేదో అనే విష‌యం కూడా తమకు తెలియదని చెబుతున్నారు సితి తండ్రి. అందుకే తనను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్తామని చెప్పారు. మళ్లీ నిద్ర లేచే వ‌ర‌కూ అక్క‌డే ప‌డుకుంటుందని వివరించారు. కొన్నిసార్లు నిద్రలోనే ఆమెకు మూర్చ వస్తుంది. అప్ర‌య‌త్నంగా కండ‌రాలు ముడుచుకుపోతాయి. అందుకే ఇలాంటి స‌మ‌యంలో హాస్ప‌ట‌ల్‌లో ఉండ‌టం చాలా అవ‌స‌రని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అక్కడ డాక్టర్లు ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించి స‌హాయం చేస్తారని వివరించారు సితి తండ్రి ముల్యాది.

మిగ‌తా సమ‌యంలో ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంద‌ని చెబుతున్నారు వైద్యులు. ఆమెకున్న ఒక‌టే స‌మ‌స్య.. ఒకేసారి ఎక్కువ రోజులు నిద్ర‌పోవ‌డ‌మే. ఈ కండీషన్‌కు ఎలాంటి మందులూ లేవు. అందుకే మళ్లీ నిద్ర‌లేచే వ‌రకు తనను హాస్ప‌ట‌ల్‌లోనే ఉంచి, లేచిన త‌ర్వాత ఇంటికి తీసుకెళ్తారు. ప్ర‌స్తుతాని క్లీన్-లెవిన్ సిండ్రోమ్‌కి ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో లేదు. అయితే శ‌రీరాన్ని స్టిమ్యులేట్ చేసే మందులు వాడుతూ నిద్ర సమయాన్ని త‌గ్గించే అవ‌కాశం మాత్రం ఉంది.
Published by:Krishna Adithya
First published: