• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • READ THIS BEFORE FLYING KITES BE CAREFUL SAVE THE BIRDS KRS

Kites: గాలిపటాలు ఎగరేయాలనుకుంటున్నారా.. ఇది చూడండి.. 'హంతకులు కావొద్దు..!'

Kites: గాలిపటాలు ఎగరేయాలనుకుంటున్నారా.. ఇది చూడండి.. 'హంతకులు కావొద్దు..!'

ప్రతీకాత్మక చిత్రం

మనుషులు సరదా కోసం ఎగురవేస్తున్న గాలి పటాలు (Kites) పక్షుల పాలిట మరణ శాసనాలు అవుతున్నాయి. దీంతో మనుషులు పక్షుల హంతకులు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పక్షి ప్రేమికులు, పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. గాలి పటాల వల్ల పక్షులకు ప్రమాదమేమిటి.. అలా కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూడండి.. పాటించండి..  

  • Share this:
    గాలి పటాలను (Kites) లక్షలాది మంది ఎగరేస్తున్నారు. ఆకాశంలో అవి ఎత్తు వెళ్లేకొద్దీ కేరింతలు కొడతారు. ఎంజాయ్ చేస్తారు. కొందరు పోటీలు పెట్టుకొని మరీ ప్రమాదకరమైన దారాలు (మాంజాలు) వాడి పెద్దపెద్ద గాలిపటాలను వాడతారు. కానీ గాజులు, మెటల్​తో తయారు చేసి ప్లాస్టిక్ (సింథటిక్​) పూత కప్పిన మాంజాలు చేస్తున్న రక్త సంతకాలు ఎవరికీ పట్టడం లేదు. ఈ ప్రమాదకర మాంజాల వల్ల ప్రతి ఏడాది వేలాది పక్షులు చనిపోతున్నాయి. చేయని నేరానికి అందమైన పక్షుల గొంతులు కోసుకుపోతున్నాయి.

    ముఖ్యంగా సంక్రాంతి పండుగ ఉన్న జనవరిలో ఎక్కువ మంది ప్రజలు గాలిపటాలు ఎగరేస్తారు. అయితే సాధారణంగా పత్తి (కాటన్​)తో తయారు చేసిన దారాలతో కైట్స్ ఎగురవేస్తే ఎలాంటి ప్రమాదం లేదు. అయితే పెద్దపెద్ద గాలిపటాలు ఎగురవేయాలని, ఎత్తుకు పంపాలనే ఉద్దేశంతో ప్రమాదకరమైన దారాలు (మాంజాలు) వాడుతున్న వారి వల్ల పక్షులకు అంతులేని ప్రమాదాలు జరుగుతున్నాయి.

    గాలి పటాలకు వాడే మాంజాలు కరెంట్ స్థంబాలు, వైర్లు, వివిధ ఎత్తైన ప్రదేశాల్లో చిక్కుకుంటున్నాయి. దానిపై వాలుతున్న పక్షుల అనుకోకుండా వాటి సమీపానికి వెళుతున్నాయి. వాలే, ఎగిరే సమయాల్లో వాటి శరీరాలకు ఆ దారాలు కోసుకుంటున్నాయి. చిక్కుకుంటున్నాయి. పక్షులకు తీవ్ర గాయాలు అవుతున్నాయి. రక్తం అధికంగా పోతుండడంతో చాలా పక్షులు చనిపోతున్నాయి. ఆ మంజాలు పక్షుల పాలిట ఉరి కంబాలులగా మారుతున్నాయి. ఇలా ప్రతీ ఏడాది జరుగుతోంది. వేలాది పక్షులు కన్నుమూస్తున్నాయి. అయినా మనుషులు మాత్రం మాంజాలను వాడడం మాత్రం మానడం లేదు. కొన్ని చోట్ల ప్రభుత్వాలు నిషేధించినా మార్కెట్లో విరివిగా దొరుకుండడంతో వాటినే వాడుతున్నారు. ఈ విధంగా వినోదం కోసం గాలి పటాలు ఎగిరేస్తున్న కొందరు పక్షుల మరణాలకు కారణవుతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి గాలి పటాలు ఎగిరేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని పక్షి ప్రేమికులు, పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. సాధారణ పత్తి దారాలతో గాలిపటాలను ఎగురవేసి పక్షులకు ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. పర్యావరణ సమతుల్యానికి పాలుపడాలని పిలుపునిస్తున్నారు.

    తాజాగా అటవీ శాఖ అధికారి శ్వేతా ట్వీట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. గాలి పటాలు ఎగరేసే మనుషుల వల్ల పక్షులు ఏ విధంగా చనిపోతున్నాయన్న విషయాన్ని ఫొటోలతో సహా ఆమె వివరించారు.

    "కారణం – మనిషి, స్థలం – నాసిక్,  ఆయుధం – మాంజా...  మనిషి సంధించిన మాంజా అనే ఆయుధం కారణంగా నాసిక్​లో ఓ పక్షి చనిపోయింది" ఆమె ట్వీట్ చేశారు. అచ్చం ఉరి కంబానికే వేలాడుతున్నట్టు ఉన్న ఆ పక్షి ఫొటో కన్నీరు తెప్పిస్తోంది. ఇది కచ్చితంగా ఆత్మహత్య కాదని, మనుషులు చేసిన హత్యేనని ఆమె ట్వీట్ చేశారు. అందరూ పత్తి (కాటన్​)తో చేసిన దారాలనే వాడాలని, ప్లాస్టిక్​ నో చెప్పాలని కోరారు.

    అందుకే పక్షులకు ఎలాంటి ప్రమాదం జరుకుండా ప్రతి ఒక్కరూ సాధారణ పత్తితో చేసిన దారాలతోనే గాలి పటాలు ఎగరేయాలి. ఎట్టిపరిస్థితుల్లో గాజు పెంకులు, మెటల్​తో తయారు చేసి ప్లాస్టిక్ పూత పూసిన మాంజాలను వాడకూడదు.
    Published by:Krishna P
    First published: