RBI కీలక నిర్ణయం.. రియల్ ఎస్టేట్‌కు బిగ్ రిలీఫ్..

RBI Repo Rate : భారతీయ రిజర్వు బ్యాంకు(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం ప్రభావంతో కీలక వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: February 6, 2020, 1:05 PM IST
RBI కీలక నిర్ణయం.. రియల్ ఎస్టేట్‌కు బిగ్ రిలీఫ్..
ఆర్బీఐ
  • Share this:
భారతీయ రిజర్వు బ్యాంకు(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం ప్రభావంతో కీలక వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 5.15 శాతం వద్దే నిలకడగా ఉండనుంది. రెపో రేటును కదపకుండా కొనసాగించడం ఇది రెండో సారి. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానెటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు అవసరమైన పాలసీ విధానాలను కొనసాగించేలా చర్యలు తీసుకోనుంది. గత ఏడాది రెపో రేటును 135 బేసిస్ పాయింట్లు తగ్గించగా, డిసెంబరు నుంచి స్థిరంగా కొనసాగిస్తూ వచ్చింది. ఈ నిర్ణయంతో పలు రంగాలు ఉపశమనం పొందనున్నాయి.

కాగా, రెపో రేటును స్థిరంగా కొనసాగించేలా ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి బిగ్ రిలీఫ్ దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న ఈ రంగానికి ఆర్బీఐ చేయూతను ఇచ్చినట్లే అవుతుందని వివరిస్తున్నారు.
First published: February 6, 2020, 1:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading