కొత్త వెయ్యి నోటు వచ్చేసింది.. ఇదీ నిజం..

రూ.2వేల నోటును ఆర్బీఐ బ్యాన్ చేస్తే.. మళ్లీ రూ.వెయ్యి నోటును మార్కెట్‌లోకి తీసుకొస్తుందా? అని జోరుగా చర్చ మొదలైంది. దానికి తగ్గట్లుగానే సోషల్ మీడియాలో రూ.1000 నోటు కొత్త రూపుతో ప్రత్యక్షమైంది.

news18-telugu
Updated: October 16, 2019, 1:40 PM IST
కొత్త వెయ్యి నోటు వచ్చేసింది.. ఇదీ నిజం..
నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటో..
  • Share this:
నోట్ల రద్దు తర్వాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. పాత రూ.100, రూ.50, రూ.10 నోట్లను కొనసాగిస్తూనే కొత్త నోట్లను తీసుకొచ్చింది. అంతేకాకుండా.. రూ.200 నోటును తీసుకొచ్చింది. అయితే.. త్వరలోనే రూ.2000 నోటుకు స్వస్తి పలికే దిశగా ఆర్బీఐ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క కొత్త రూ.2వేల నోటును కూడా ముద్రించలేదు. ఇదే విషయాన్ని ఆర్బీఐ సమాచార హక్కు చట్టం కింద వెల్లడించింది. అయితే, రూ.2వేల నోటును బ్యాన్ చేస్తే.. మళ్లీ రూ.వెయ్యి నోటును మార్కెట్‌లోకి తీసుకొస్తుందా? అని జోరుగా చర్చ మొదలైంది. దానికి తగ్గట్లుగానే సోషల్ మీడియాలో రూ.1000 నోటు కొత్త రూపుతో ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన జనమంతా నిజంగానే కొత్త రూ.1000 నోటు వస్తోందని అనుకుంటున్నారు. అయితే, సోషల్ మీడియాలో వచ్చిన ఆ సందేశాన్ని న్యూస్18 Fact Check చేయగా అది.. అబద్ధమని తేలింది. వాస్తవానికి కొత్త రూ.1000 నోటును తీసుకొస్తామని గానీ, దానికి సంబంధించి నమూనా చిత్రాన్ని గానీ ఆర్బీఐ ప్రకటించలేదు.

నెట్టింట్లో వైరల్ అవుతున్న రూ.1000 నోటు


నెట్టింట్లో వైరల్ అవుతున్న రూ.1000 నోటు


ఇదిలా ఉండగా, రూ.2వేల నోట్ల ముద్రణను మాత్రం ఆర్బీఐ ఆపేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ రూ. 2 వేల నోట్లను ప్రింట్ చేసిన ఆర్బీఐ.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లను ముద్రించింది. ఆ ముద్రణ 2018-19 సంవత్సరానికి వచ్చే సరికి 46.690 మిలియన్ నోట్లకు చేరింది. అదే.. ఈ ఏడాది మాత్రం ఒక్క రూ.2 వేల నోటును కూడా ఆర్బీఐ ముద్రించలేదు. ఇదే విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ స్పష్టం చేసింది.
First published: October 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading