ఆన్‌లైన్ లావాదేవీలపై ఛార్జీల ఎత్తివేత.. జూలై 1 నుంచే అమల్లోకి..

NEFT, RTGS Transactions: బ్యాంకులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలపై రుసుము వసూలు చేయవద్దని వెల్లడించింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 12, 2019, 7:59 AM IST
ఆన్‌లైన్ లావాదేవీలపై ఛార్జీల ఎత్తివేత.. జూలై 1 నుంచే అమల్లోకి..
ఆర్బీఐ (ఫైల్)
  • Share this:
ఆన్‌లైన్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు బ్యాంకులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలపై రుసుము వసూలు చేయవద్దని వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, నగదు లావాదేవీలు తగ్గించడం, డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఛార్జీలను రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. భారీ మొత్తంలో నిధులను బదిలీ చేసేందుకు ఆర్‌టీజీఎస్‌, రూ.2 లక్షల్లోపు నగదును బదిలీ చేసేందుకు నెఫ్ట్‌ ఉపయోగపడతాయి. ప్రస్తుతం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నెఫ్ట్‌ లావాదేవీలకు రూ.1 నుంచి రూ.5 వరకు, ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలకు రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తోంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 12, 2019, 7:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading