గొప్ప శుభవార్త చెప్పిన రిజర్వు బ్యాంకు.. ఆన్‌లైన్ లావాదేవీలపై ఛార్జీలు ఎత్తేస్తూ..

వినియోగదారుల ప్రయోజనార్థం ఆన్‌లైన్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్తె లిపారు. ఇక, వరుసగా మూడో సారి రెపోరేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఆర్బీఐ మాండెటరీ పాలసీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 6, 2019, 12:24 PM IST
గొప్ప శుభవార్త చెప్పిన రిజర్వు బ్యాంకు.. ఆన్‌లైన్ లావాదేవీలపై ఛార్జీలు ఎత్తేస్తూ..
రిజర్వు బ్యాంక్
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 6, 2019, 12:24 PM IST
రిజర్వు బ్యాంకు వినియోగదారులకు శుభవార్త చెప్పింది. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలపై విధిస్తున్న ఛార్జీలను ఎత్తేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. వినియోగదారుల ప్రయోజనార్థం ఆన్‌లైన్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక, వరుసగా మూడో సారి రెపోరేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఆర్బీఐ మాండెటరీ పాలసీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గృహ, వాహన రుణాలపై వడ్డీ తగ్గనుంది. దీనివల్ల వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది. ఇక, 2019-2020 ఏడాదికి గానూ ద్రవ్యోల్బణాన్ని 3.1 శాతంగా అంచనా వేసింది.

First published: June 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...