రూ.1000 నోటుపై ఆర్బీఐ కీలక ప్రకటన..

ఇటీవల కాలంలో మళ్లీ రూ.1000 నోటును ఆర్బీఐ ముద్రిస్తోందని, మార్కెట్లోకి రిలీజ్ చేసిందంటూ వార్త వైరల్ అయింది. అయితే, అదంతా ఫేక్ న్యూస్ అని ఆర్బీఐ స్పష్టం చేసింది.

news18-telugu
Updated: October 18, 2019, 10:07 PM IST
రూ.1000 నోటుపై ఆర్బీఐ కీలక ప్రకటన..
నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటో..
news18-telugu
Updated: October 18, 2019, 10:07 PM IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ కొత్తగా రూ.1000 నోటును విడుదల చేసిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతోపాటు ఓ రూ.1000 నోటు ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో విస్త్రతంగా ప్రచారం అవుతోంది. అయితే, తాము కొత్త రూ.1000 నోట్ల విడుదల చేయలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. 2016 నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు సమయంలో అప్పటి వరకు ఉన్న రూ.1000, రూ.500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ సమయంలో కొత్త రూ.2000 నోటు, కొత్త రూ.500 నోటు మార్కెట్లోకి వచ్చాయి. ఆ తర్వాత రూ.200 నోటును కూడా ఆర్బీఐ తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో మళ్లీ రూ.1000 నోటును ఆర్బీఐ ముద్రిస్తోందని, మార్కెట్లోకి రిలీజ్ చేసిందంటూ వార్త వైరల్ అయింది. అయితే, అదంతా ఫేక్ న్యూస్ అని ఆర్బీఐ స్పష్టం చేసింది.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...