Video : ప్లేట్ లోంచీ పారిపోయిన చికెన్ ముక్క... నమ్మలేని నిజం...?

ఇది నిజంగా షాకింగ్ వీడియో. చూస్తూ ఉండగానే... ఆ చికెన్ ముక్క ప్లేట్ లోంచీ పారిపోయేందుకు ప్రయత్నించి... చివరకు కిందపడింది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 27, 2019, 7:01 AM IST
Video : ప్లేట్ లోంచీ పారిపోయిన చికెన్ ముక్క... నమ్మలేని నిజం...?
ప్లేట్ లోంచీ కింద పడిన మాంసం ముక్క (Image : FB - Rie Phillips)
  • Share this:
Viral Video : ఇంటర్నెట్‌లో వైరల్ వీడియోలకు లెక్క లేదు. వాటిలో ఇప్పుడు మరొకటి చేరింది. కాకపోతే... అది మరీ చిత్రంగా ఉంది. అదెలా జరిగిందని అందరూ అడుగుతున్నారు. ఇప్పటికే ఆ వీడియోని కోటి 50 లక్షల మందికి పైగా చూశారు. చూసిన వీడియోని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఎందుకంటే... అది నిజమో అబద్ధమో అర్థం కావట్లేదు మరి. 33 సెకండ్ల ఆ వీడియో క్లిప్... ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ అయ్యింది. అందులో ఓ రెస్టారెంట్‌లోని ఓ టైబుల్‌పై ఉంచిన ప్లేట్‌లో పచ్చి మాంసం ముక్కలున్నాయి. వాటిలో ఓ ముక్క ప్రాణం లేచివచ్చినట్లుగా ఒక్కసారిగా కదిలింది. గిలగిలా కొట్టుకుంటూ... ప్లేట్ నుంచీ పక్కకు జరిగింది. అక్కడి నుంచీ పట్టుతప్పి... నేలపై పడింది. ఆ సమయంలో... ఆ టైబుల్ దగ్గర కూర్చున్నవాళ్లు భయంతో, ఆశ్చర్యంతో అరిచినట్లుగా అరుపులు కూడా వినిపిస్తున్నాయి.

అసలీ వీడియో ఎక్కడ షూట్ చేశారో, ఎవరు చేశారో తెలియదు. ఐతే... అక్కడ చాప్‌స్టిక్స్ ఉన్నాయి. దాన్ని బట్టీ... భోజనం చేయాలనుకునేవాళ్లు... టేబుల్ పైనే వండుకునే సదుపాయం అక్కడ ఉన్నట్లు కనిపిస్తోంది. అందువల్లే అప్పుడే కోసిన పచ్చిమాంసం టేబుల్‌పై తెచ్చి పెట్టారనీ, అందులోంచీ ఆ ముక్క ప్రాణంతో విలవిలలాడుతూ పడిపోయిందని భావిస్తున్నారు కొందరు నెటిజన్లు.


ఇదేమీ వింత కాదంటున్నారు కొందరు. నిజానికి ఏ ప్రాణి అయినా చనిపోయిన తర్వాత కొన్ని శరీర భాగాలు... కొంత సమయం పాటూ కదులుతూనే ఉంటాయనీ, ఈ వీడియోలో కూడా అదే జరిగిందని అంటున్నారు.

First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>