RAVANA EFFIGY EXPLODES IN PUNJAB BATALA DURING DUSSEHRA EVENT VIDEO GOES VIRAL SU
Viral Video: రావణ దహనంలో ఒక్కసారిగా పేలుడు.. భయంతో పరుగులు తీసిన జనాలు
రావణ దహనం కార్యక్రమంలో ప్రమాదం
దసరా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దేశంలోని చాలా చోట్ల రావణ దహన కార్యక్రమం జరిగింది. కానీ పంజాబ్లోని బాటాలాలో నవరాత్రి వేడుకల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన రావణ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో ప్రమాదం
దసరా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దేశంలోని చాలా చోట్ల రావణ దహన కార్యక్రమం జరిగింది. కానీ పంజాబ్లోని బాటాలాలో నవరాత్రి వేడుకల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన రావణ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పేలుడు జరగడంతో.. అక్కడున్న జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
వివరాలు.. బటాలాలోని డీఏవీ స్కూల్ సమీపంలోని మైదానంలో ఆదివారం రావణ దహన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ దృశ్యాలను చూసేందుకు అక్కడికి భారీగా జనాలు తరలివచ్చారు. కొందరు ముందుకు వెళ్లి రావణ దిష్టిబొమ్మకు నిప్పటించేందుకు ముందుకు వచ్చారు. వారు నిప్పటిస్తున్న సమయంలోనే దిష్టిబొమ్మ లోపల ఉన్న పటాకులు పేలాయి. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో జనాలు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో చిన్నపాటి తొక్కిసలాట జరగడంతో కొందరు కిందపడిపోయారు. వారిని అక్కడున్న పైకి లేపారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
కాగా, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే అశ్వానీ సేఖ్రి ఆధ్వర్యంలో జరిగినట్టుగా తెలుస్తోంది. దసరా కమిటీ, స్థానిక నాయకులతో కలిసి ఆయన ఈ వేడుకలకు నేతృత్వం వహించారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.