బిజినెస్ టైకూన్లలో రతన్ టాటా అత్యంత భిన్నమైన వ్యక్తి. డౌన్ టు ఎర్త్ ప్రవర్తనతో ఎప్పుడూ అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటారు. వేల కోట్ల ఆస్తులు ఉన్నా... చాలా సింపుల్‌గా ఉంటారు. దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ఆయనంతే మారరు. 24 క్యారెట్ గోల్డ్ హృదయం రతన్ టాటా సొంతం. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు టాటా. మాజీ ఉద్యోగి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి ఆయన ముంబై నుంచి పుణెకు వెళ్లి పరామర్శించారు. అందుకే నెటిజన్లు ఆయన్ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. సరిలేరు మీకెవ్వరు అని ఆకాశానికెత్తుతున్నారు.
తనవద్ద పనిచేసిన ఓ మాజీ ఉద్యోగిని పరామర్శించేందుకు రతన్ టాటా వెళ్లారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తన మాజీ ఉద్యోగి క్షేమ సమాచారాన్ని స్వయంగా తెలుసుకునేందుకు వచ్చిన రతన్ వెంట ఒక్క పనివాడు, బౌన్సరు, ఆఖరికి ఆఫీసు స్టాఫ్, మీడియా కూడా లేకపోవటం నెటిజన్లకు ఏకంగా షాక్ ఇచ్చింది. కనీసం ఆయన వస్తున్న సమాచారం కూడా ఎవరికీ ఉప్పందించకుండా, రతన్ టాటా వచ్చారు. ఆయన కలవాలనుకున్న వ్యక్తిని కలిశారు. వచ్చిన పని ముగిసిన వెంటనే ఎటువంటి హడావుడి చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మొత్త వివరాలను యోగేష్ దేశాయ్ అనే ఓ సీఈఓ పోస్ట్ చేస్తే నెటిజన్లకు అసలు విషయం బోధపడిందన్నమాట. ఇప్పుడీ పోస్టు కూడా చాలా వైరల్ అవుతోంది.
టన్నుల కామెంట్లు..
యోగేష్ దేశాయ్ లింక్డ్ ఇన్ (LinkedIn)లో ఈ పోస్ట్‌ను షేర్ చేయగా టన్నులకొద్దీ కామెంట్లు వచ్చిపడుతున్నాయి. అసలు సిసలు లెజెండ్స్ అంటే వీరు అంటున్న నెటిజన్..లు రతన్ టాటా సింప్లిసిటీకి ఫిదా అవుతూనే ఉన్నారు. బిజినెస్ మ్యాన్ అంటే ఈయనలా మానవతావాదుల్లా ఉండాలనే కామెంట్లు వచ్చిపడుతున్నాయి. హ్యాట్సాఫ్ సర్..అంటూ మరో నెటిజన్ కామెంట్ చేయగా ఈ కామెంట్లు, పోస్టులు కూడా ఆసక్తిగొలిపేలా ఉన్నాయి. జనవరి 4న లింక్డిన్ లో పోస్ట్ అయిన ఈ వార్త ఇప్పటికే 1.4 లక్షల రియాక్షన్స్ సంపాదించటం హైలైట్. ఆయన "ఎప్పుడూ స్ఫూర్తిదాయకమైన గొప్ప వ్యక్తిత్వం కలిగినవారం"టూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. “ఏక్ హీ తో దిల్ హై సర్, కిత్నీ బార్ జీతోగే”.. "మాకున్నది ఒకే ఒక్క హృదయం.. దాన్ని ఎన్నిసార్లు గెలుచుకుంటారు సర్" అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ నిజంగా అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Ratan Tata, Tata Group