Ratan Tata Nano Journey : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా(Ratan Tata)అత్యంత సింపుల్‌గా ఉంటూ అందర్నీ ఆకర్షిస్తుంటారు. ఈ బిజినెస్ దిగ్గజం హుందాతనం, సింప్లిసిటీ చాలా సపరేట్. దాతృత్వం లోనూ రతన్ టాటా తనకుతానే సాటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే రతన్ టాటా సింప్లిసిటీ మరోసారి బయటపడింది. తాజాగా రతన్ టాటా ఎలాంటి బాడీగార్డులు పక్కన లేకుండా నానో కారులో ముంబైలోని తన తాజ్ హోటల్ కి వెళ్లారు. రతన్ టాటా తలుచుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బుగాట్టీ, మెర్సిడెస్ వంటి కార్లలో తిరగగలరు.కానీ ఆయన మాత్రం చాలా సాధారణ జీవితాన్ని గడుపుతూ అందరి మనసులను గెలుచుకున్నారు. టాటా గ్రూప్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శంతాను నాయుడు రతన్ టాటాను నానో కారులో తాజ్ హోటల్ వద్దకు తీసుకెళ్లారు.
రతన్ టాటా నానో కారు(Nano Car)లో తాజ్ హోటల్ కార్యక్రమానికి హాజరు కాగా హోటల్ సిబ్బంది అతన్ని గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. రతన్ టాటా సింప్లిసిటీ చూసి నెటిజన్స్ తెగ ముచ్చటపడ్డారు. ఆయనకు సెల్యూట్ కూడా చేశారు. సో సింపుల్ అండ్ హంబుల్ అంటూ ఓ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా,లెజెండ్ అంటూ మరి కొందరు కామెంట్ చేశారు. గొప్ప మానవతా వాది.. మానవతా వాదికి నిండుతనం రతన్ టాటా అంటూ మరి కొందరు కామెంట్స్ చేశారు.
Ratan Tata arrives at Taj Mumbai in a Nano sitting in front seat with his driver. No security either. Exemplary simplicity personified. 💯👏🏾 pic.twitter.com/XAbyLLoCpt
— Maya (@Sharanyashettyy) May 17, 2022
14 ఏళ్ల క్రితం నానో కారు విడుదల అయ్యింది. టాటా తరపున దేశంలో అత్యంత చవకైన ధరకు నానో కారును రతన్ టాటా మార్కెట్‌లోప్రవేశపెట్టి, సంచలనం రేపారు. సామాన్య కుటుంబీకులు తరుచూ తమ పిల్లలతో స్కూటర్ల మీద వెళ్లడం చూశానని, ఇలా వెళ్లడం వల్ల వారికి ఇబ్బంది కలుగుతుందని భావించానని,అందుకే కేవలం రూ.1లక్ష ధరకే నానో తెచ్చానని గతంలో రతన్ టాటా ప్రకటించారు. మధ్య తరగతి పిల్లలు కూడా కారులో తిరగాలనే తన కలను టాటా నానో కారు ద్వారా ఆయన తీర్చుకోవాలనుకున్నారు.అయితే ఇప్పుడు ఆయన కల కలగానే మిగిలిపోయింది. ఈ కారును ఇప్పుడు ఎవరూ కొనుగోలు చేయడం లేదు. 2019లో కేవలం ఒకే ఒక్క నానో కారు మాత్రమే అమ్ముడు పోయింది.2019 సంవత్సరంలోనే ఈ కారు ఉత్పత్తిని నిలిపేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mumbai, Nano, Ratan Tata