హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

కుక్కను దత్తత తీసుకోండి... రతన్ టాటా వైరల్ పోస్టుకు నెటిజన్ల ప్రశంసలు...

కుక్కను దత్తత తీసుకోండి... రతన్ టాటా వైరల్ పోస్టుకు నెటిజన్ల ప్రశంసలు...

కుక్కను దత్తత తీసుకోండి... రతన్ టాటా వైరల్ పోస్టుకు నెటిజన్ల ప్రశంసలు... (credit - instagram)

కుక్కను దత్తత తీసుకోండి... రతన్ టాటా వైరల్ పోస్టుకు నెటిజన్ల ప్రశంసలు... (credit - instagram)

Ratan Tata : పారిశ్రామిక వేత్తల్లో సామాజిక స్పృహ ఉండేవారు కొద్ది మందే. అలాంటి వారిలో ఒకరైన రతన్ టాటా... తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

  Ratan Tata : ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా... సోషల్ మీడియాను మంచి పనుల కోసం బాగా వాడుకుంటారు. తాజాగా ఈ 82 ఏళ్ల లెజెండ్... ఓ 10 నెలల కుక్క ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పెట్టి... ఎవరైనా దాన్ని దత్తత తీసుకోండి అని కోరారు. ఈ కుక్క పేరు సూర్. ఇప్పటికే దీన్ని చాలా మంది దత్తత తీసుకున్నారన్న రతన్ టాటా... ప్రస్తుతం ఇది ఒంటరి అయిపోయిందన్నారు. ఇదివరకు కూడా ఇలాగే ఓసారి మరో కుక్క మిరాకి సంబంధించి పోస్టును పెడితే... చాలా మంది తన ఫాలోయర్లు... ఆ కుక్కలు మేలు చేశారని తెలిపారు. సూర్ విషయంలోనూ తనకో ఫ్యామిలీ దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.


  మీరు గానీ లేదా... ఎవరైనా గానీ కుక్కను దత్తత తీసుకోవాలనుకుంటే... వివరాలు ఇవ్వండి అని రతన్ టాటా ఇన్‌స్టాగ్రాంలో కోరారు. ఈ కుక్కను మరోసారి ఇలా ఒంటరి చేయకుండా ఉండే రోజు వస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. కుక్క దత్తతకు సంబంధించి ఓ లింక్ ఇచ్చిన ఆయన... అందులో కొన్ని ప్రశ్నలు కూడా ఉంచారు. అలాగే... ఈ కుక్కను మహారాష్ట్రోలోని... పుణెకు చెందిన వారే దత్తత తీసుకోవాలనే కండీషన్ పెట్టారు.

  రతన్ టాటా వైరల్ పోస్టుకు నెటిజన్ల ప్రశంసలు... (credit - instagram)

  ఈ పోస్టుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతో బిజీగా ఉండే రతన్ టాటా... ఇలాంటి ఓ సాధారణ కుక్క విషయంలోనూ ఇంతలా ఆవేదన చెందుతుండటాన్ని మెచ్చుకుంటున్నారు. త్వరలోనే ఆ కుక్కను పుణెలో ఎవరైనా దత్తత తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Instagram, Ratan Tata, VIRAL NEWS

  ఉత్తమ కథలు