రతన్ టాటా. భారత్‌లో అత్యంత ప్రముఖులైన వ్యక్తుల్లో ఒకరు. ఆయనకు కూడా సమస్యలు ఉంటాయా? ఉన్నా కూడా సాధారణ జనాలను హెల్ప్ అడుగుతారా? అని ఆలోచిస్తున్నారా? అయితే, ఈ వార్త చదవండి. రతన్ టాటా సాయం కోరారు. అయితే, ఆయన తన కోసం కాదు. ఓ వీధి కుక్క కోసం. 80 సంవత్సరాల ఈ టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాకు జంతువులు అంటే, ముఖ్యంగా కుక్కలు అంటే ఎంత ప్రేమో చెప్పాల్సిన పనిలేదు. కుక్కల మీద ఆయన ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఇన్ స్టా గ్రామ్ పోస్టులను గమనిస్తే ఆయనకు కుక్కల మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు బుజ్జి బుజ్జి కుక్క పిల్లల ఫొటోలను షేర్ చేస్తున్నారు. అలాగే, కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపండి అంటూ అందరిలోనూ చైతన్యం నింపుతున్నారు. ముఖ్యంగా గాయపడిన కుక్కలు, వీధి కుక్కల మీద ప్రేమ చూపాలని కోరుతున్నారు. తాజాగా, రతన్ టాటా మరో ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ చేశారు. అందులో ‘స్ప్రైట్ అనే కుక్కకు ఓ మంచి ఫ్యామిలీ దొరికేందుకు మీరు సాయం చేయగలరా?’ అంటూ కామెంట్ చేశారు.
ఇంతకు ముందు కూడా మీరు నాకు రెండు సార్లు సాయం చేశారు. అందుకు నేను చాలా కృతజ్ఞుడిని. ఇప్పుడు మరోసారి మిమ్మల్ని కోరుతున్నా. ఈ స్ప్రైట్‌కు ఓ కుటుంబాన్ని వెదికేందుకు నాకు సాయం చేస్తారా? ఈ కుక్కకు ఓ ప్రమాదంలో కాళ్లు రెండు చచ్చుబడిపోయాయి. దీన్ని దత్తత తీసుకోవాలంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.’ అంటూ రతన్ టాటా ఓ కుక్క ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు.
View this post on Instagram
రతన్ టాటా ఈ పోస్ట్ చేసిన వెంటనే కొన్ని వందల మంది జంతు ప్రేమికులు లైక్ చేశారు. ‘మీలాంటి వాళ్లు ఇంకా కావాలి సార్.’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఆ కుక్క కాళ్లు చచ్చుబడి పోవడంతో అది నడవడానికి ఓ చక్రాల కుర్చీ లాంటి దాని సాయంతో నడుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ratan Tata, VIRAL NEWS