హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Shocking: వామ్మో.. పెషెంట్ల గ్లూకోజ్ ను తాగేస్తున్న ఎలుకలు.. వైరల్ వీడియో..

Shocking: వామ్మో.. పెషెంట్ల గ్లూకోజ్ ను తాగేస్తున్న ఎలుకలు.. వైరల్ వీడియో..

గ్రిల్ మీద పాకుతున్న ఎలుకలు

గ్రిల్ మీద పాకుతున్న ఎలుకలు

Chhattisgarh: ఆస్పత్రిలో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బెడ్ పక్కన ఉన్న ఐరన్ రాడ్ గుండా.. పెషెంట్ దగ్గరకు వెళ్లి తీరిగ్గా సెలైన్ ను తాగేస్తున్నాయి.

కొన్ని ఆస్పత్రులలో రోగులకు సరైన వసతులు ఇవ్వడంలో విఫలమవుతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల, బెడ్ మీద పడుకుని ఉన్న రోగులను, ఎలుకలు కొరకడం, పసికందులను గాయపర్చడం వంటి అనేక సంఘటనలు వార్తలలో నిలిచాయి. మరికొన్ని చోట్ల కుక్కలు, ఆస్పత్రులలో ప్రవేశించి బెడ్ పైన ఉన్న చిన్నారిని నోటితో కర్చుకుని తీసుకొని వెళ్లిపోయింది. అదే విధంగా.. మార్చురీలో శవాలను ఎలుకలు పీక్కుతున్న ఘటనలు, రోగుల బంధువుల సామానులను కూడా ఎలుకలు పాడు చేసిన అనేక ఘటనలు గతంలో వార్తలలో నిలిచాయి. ఇప్పటికి అనేక ప్రభుత్వ, కార్పోరేట్ ఆస్పత్రులలో (Hospital) సదుపాయాల లోపంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఈ కోవకు చెందిన మరో ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. ఛత్తీస్‌గఢ్‌లో ( Chhattisgarh) షాకింగ్ ఘటన జరిగింది. బస్తర్ జిల్లా జగదల్‌పూర్ నగరంలోని ఓ మెడికల్ కాలేజీలో నిర్లక్ష్యానికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో (Social media)  చక్కర్లు కొడుతుంది. బలిరామ్ కశ్యప్ మెమోరియల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో రోగుల డ్రిప్ పైపులను నమిలి గ్లూకోజ్ తాగుతున్న ఎలుకలు (Rat Chews Patients Glucose ) కెమెరాకు చిక్కాయి. మెడికల్ కాలేజ్ లో.. రోగి పడుకుని ఉన్న బెడ్ మీదకు ఎలుకలు వస్తున్నాయి. ఆ తర్వాత.. అవి అక్కడ ఉన్న సెలైన్ ను తాగేస్తున్నాయి.


ఈ ఘటనను అక్కడే బెడ్ పై ఉన్న మరో వ్యక్తి రికార్డు చేశారు. దీంతో ఈ ఘటన వార్తలలో నిలిచింది. అది కాస్త వైరల్ గా (viral video) మారింది. ఒక పెద్ద ఎలుక సీలింగ్‌లోని రంధ్రం నుంచి డ్రిప్ స్టాండ్‌పైకి క్రాల్ చేయడం చూడవచ్చు. అప్పుడు ఎలుక డ్రిప్ పైపును తడుముతూ, దాని నుండి ప్రవహించే గ్లూకోజ్ నీటిని తాగడం చూడవచ్చు. దీనిపై ఆస్పత్రి వర్గాలను నిలదీయగా.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సూపరింటెండెంట్ ఆసుపత్రి ఆవరణలో ఎలుకల సమస్యను ఎదుర్కొంటున్నట్లు అంగీకరించారు.

నివేదిక ప్రకారం, వైద్య సంస్థలో ఇప్పటివరకు 1200 ఎలుకలు చంపబడ్డాయి. ఈ విషయంపై మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ యు.ఎస్.పైంకరను ప్రశ్నించగా, ఘటనపై సరైన విచారణ జరిపిన తర్వాత మాత్రమే తాము వ్యాఖ్యానించగలమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

First published:

Tags: Chhattisgarh, Hospitals, Rats, Viral Video

ఉత్తమ కథలు