హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

బీచ్‌లో డ్యాన్స్‌ ఇరగదీసిన రష్మిక..ఆ ట్రెండింగ్‌ సాంగ్‌కే స్టెప్పులేసిన శ్రీవల్లి

బీచ్‌లో డ్యాన్స్‌ ఇరగదీసిన రష్మిక..ఆ ట్రెండింగ్‌ సాంగ్‌కే స్టెప్పులేసిన శ్రీవల్లి

VIDEO VIRAL: రష్మిక మందనా బీచ్‌లో హలమతి హబిబో సాంగ్‌కి స్టెప్పులు వేసింది. బాలీవుడ్‌ మూవీ షూటింగ్‌ గ్యాప్‌లో కో స్టార్ వరుణ్ ధవన్‌తో కలిసి వేసిన క్రేజీ మూమెంట్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

VIDEO VIRAL: రష్మిక మందనా బీచ్‌లో హలమతి హబిబో సాంగ్‌కి స్టెప్పులు వేసింది. బాలీవుడ్‌ మూవీ షూటింగ్‌ గ్యాప్‌లో కో స్టార్ వరుణ్ ధవన్‌తో కలిసి వేసిన క్రేజీ మూమెంట్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

VIDEO VIRAL: రష్మిక మందనా బీచ్‌లో హలమతి హబిబో సాంగ్‌కి స్టెప్పులు వేసింది. బాలీవుడ్‌ మూవీ షూటింగ్‌ గ్యాప్‌లో కో స్టార్ వరుణ్ ధవన్‌తో కలిసి వేసిన క్రేజీ మూమెంట్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

స్టార్స్, సెలబ్రిటీలు సౌత్‌ సినిమా బీస్ట్‌లోని ఓ మాస్ ట్యూన్‌కి బాగా కనెక్ట్ అయ్యారు. తలపతి విజయ్‌ హీరోగా వస్తున్న ఈమూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజ్ చేసిన హలమితి హబిబో సాంగ్‌కి సౌత్ బ్యూటీ రష్మిక మందన(Rashmika Mandanna), బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్‌ కలిసి స్టెప్పులేశారు. పుష్పతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న రష్మిక..ఆ క్రేజ్‌తో మరికొన్ని బాలివుడ్ మూవీస్‌లో యాక్ట్ చేస్తోంది. ఇందులో భాగంగానే వరుణ్‌ధవన్‌(Varun Dhawan)తో కలిసి ఓ సినిమా చేస్తోంది రష్మిక. సినిమాలోని సాంగ్ షూటింగ్‌కి వెళ్లారు బాలీవుడ్‌ హీరో , టాలీవుడ్‌ హీరోయిన్. అక్కడ దొరికిన కాస్త గ్యాప్‌లోనే రష్మిక మందన, ముంబై హీరోతో కలిసి హలమతి హబిబో సాంగ్‌కి స్టెప్పులు వేసింది. ఆ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. కేవలం పది గంటల వ్యవధిలోనే ఈ డ్యాన్స్‌ వీడియోకి మూడు లక్షల లైక్‌లు వచ్చాయంటే సాంగ్‌ స్పెషాలిటీ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అరబిక్‌ కుతు సాంగ్‌పై ఇప్పటికే అన్ని భాషల హీరోలు, స్టోర్స్ట్ స్టార్‌లు, వీఐపీలు సైతం సాంగ్‌ ట్యూన్‌కి స్టెప్పులు వేయకుండా ఉండలేకపోతున్నారు. రష్మిక మందన టూపీస్ షార్ట్ డ్రెస్ వేసుకుంది. పైన జీన్స్‌ కోట్ వేసుకొని బీచ్‌లో సాంగ్‌ షూటింగ్ గ్యాప్‌లో వరుణ్‌ ధవన్‌తో డ్యాన్స్ చేసింది. మోస్ట్ ట్రెండింగ్ సాంగ్‌గా పేరు తెచ్చుకున్న హలమతి హబీబో సాంగ్‌కి సౌత్ యాక్టరస్‌ సమంత(Samantha),కీర్తి సురేష్(Keerthi suresh),పూజాహెగ్డే (Pujahegde)డ్యాన్స్‌ చేసి వీడియోలను తమ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో షేర్ చేసుకున్నారు. వాళ్ల వీడియోలకు లక్షల్లో వ్యూస్‌, లైక్స్‌కు వచ్చాయి. ఇప్పుడు రష్మిక మందన అదే రేంజ్‌లో రెచ్చిపోయి డ్యాన్స్‌ చేస్తున్న వీడియో అంతకు మించి వైరల్ అవుతోంది. ఈవీడియోని అటు రష్మిక, వరుణ్‌ ధవన్‌ తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేసుకొని ఇసుకలో డ్యాన్స్ అంటూ కామెంట్‌ పోస్ట్ చేశారు.

బ్యాండ్ బజాయిస్తున్న బీస్ట్‌ సాంగ్‌ ..

రష్మిక ఆల్రెడీ పుష్ప సినిమాలో శ్రీవల్లి సాంగ్‌తో ప్యాన్ ఇండియా స్టార్‌గానే కాదు క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అదే ఫాలోయింగ్‌తో వరుసగా బాలీవుడ్‌ సినిమాలు చేస్తోంది. రష్మిక మకాం ముంబై మార్చిన తర్వాత సిద్దార్ద్ మల్హోత్రాతో తన డెబ్యూ మూవీ మిషన్ మజ్జు కంప్లీట్ చేసింది. ఇప్పుడు మరో హీరో వరుణ్‌ ధవన్‌తో సెకండ్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉంది. ఇటు సౌత్‌లో...అటు నార్త్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది రష్మిక. పుష్ప-2 కూడా షూటింగ్‌ మొదలుపెట్టి ఈ ఇయర్‌ ఎండింగ్‌లో రిజీల్ చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by VarunDhawan (@varundvn)

అదిరిపోయే స్టెప్పులు వేసిన శ్రీవల్లి..

హలమతి హబిబో సాంగ్‌ ఇప్పుడు అక్కడ, ఇక్కడ అనే తేడా లేకుండా విపరీతంగా జనంలోకి దూసుకుపోతోంది. బీస్ట్ సినిమా కోసం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌, పూజాహెగ్డేపై ఈ సాంగ్‌ని జానీ మాస్టర్‌ డ్యాన్స్ కంపోజ్ చేశారు. సినిమా ఒరిజినల్ సాంగ్‌తో పోటీ పడుతున్నాయి స్టార్స్‌ చేస్తున్న డ్యాన్స్ వీడియోలు. రీసెంట్‌గా చేసిన రష్మిక మందన డ్యాన్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

First published:

Tags: Rashmika mandana, Viral Video

ఉత్తమ కథలు