హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

సౌత్‌లో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్..ఎవరో మీకు అర్ధమవుతోందా..

సౌత్‌లో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్..ఎవరో మీకు అర్ధమవుతోందా..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Rashmika Mandana: చిన్న సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది హీరోయిన్ రష్మిక. వరుసగా సక్సెస్‌లు రావడంతో ఇప్పుడు పరిశ్రమలోనే టాప్‌ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న తారగా మారిపోయింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అమ్మడికి అక్కడ బేరం బాగా కుదిరితే మకాం ముంబైకి మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు ఫ్యాన్స్.

ఇంకా చదవండి ...

సినీ పరిశ్రమలో ఏ హీరోయిన్‌కైనా స్టార్‌ డమ్‌ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ..ఒక్కసారి వచ్చిందంటే వాళ్ల డిమాండ్‌ ఊహించని స్థాయికి చేరుకుంటుంది. ప్రస్తుతం సౌత్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందన (Rashmika Mandana)పొజిటిషన్‌ కూడా అలాగే ఉంది. అల్లు అర్జున్ (Allu arjun)యాక్ట్ చేసిన పుష్ప (Pushpa) లాంటి ప్యాన్ ఇండియా సినిమా (Pan india movie) సక్సెస్‌ కావడంతో రష్మిక మందన( Rashmika Mandana)కు విపరీతమైన క్రేజ్‌ పెరిగింది. ఎంతగా అంటే దక్షిణాదిలోనే అత్యంత భారీ పారితోషికం(High remuneration)తీసుకుంటున్న హీరోయిన్‌(Heroine)గా ఈ ముద్దుగుమ్మ నిలిచిందంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒక్కో సినిమాకు సుమారు 3 నుంచి 4 కోట్ల రూపాయల (3-4 Crores)రెమ్యునరేషన్ తీసుకుంటోందంట రష్మిక మందన. కిర్రాక్‌ పార్టీ (Kirrak party)సినిమాతో సౌత్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే గ్లామరస్ పాత్రలు చేసి మంచి హీరోయిన్‌గా పేరు సంపాధించుకుంది. టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌లుగా ఓ వెలుగు వెలుగుతున్న మహేష్‌బాబు(Mahesh babu), అల్లుఅర్జున్‌(Allu arjun), విజయ్‌దేవరకొండ(Vijay devarakonda) పక్కన జోడి కట్టిన ఈ హీరోయిన్‌ ఖరీదైన కార్లు(Luxury cars), విలాసవంతమైన బంగ్లాల(Costly bungalows)తో పాటు భారీగానే ఆస్తులు కూడబెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ఆస్తుల విలువ 4వేల మిలియన్ డాలర్లు (4000 Million dollars)ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా దక్షిణాదిలోని ఇతర భాషల సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది రష్మిక మందన.

రష్మిక రేంజ్ ఏంటో మీకు అర్ధమవుతోందా..

ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులారిటీ వచ్చినప్పుడే దాన్ని క్యాష్‌ చేసుకోవాలనే సూత్రాన్ని బాగా పాటిస్తున్నట్లు రష్మికను చూస్తే అర్ధమవుతోంది. టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినిమాలు చేస్తూ హైదరాబాద్, బెంగుళూరు వంటి సిటీల్లో కోట్ల విలువ చేసే బిల్డింగ్‌లు కొనుగోలు చేసింది రష్మిక. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సిద్ధార్ధ్‌ మల్హోత్రాతో మిషన్ మజ్నూ సినిమా చేస్తోంది రష్మిక మందన. అలాగే వికాస్‌ భాల్‌ డైరెక్ట్‌ చేసిన గుడ్‌బాయ్‌ మూవీలో బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పటికే రష్మిక మందన ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కూడా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అంతే కాదు రష్మిక ఛరిష్మ చూస్తుంటే బాలీవుడ్‌లో ఫిక్సైపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదని ఫ్యాన్స్ అంటున్నారు.

ముంబైకి మకాం మార్చబోతున్న మందన..

గ్లామర్ పాత్రలతోనే కాకుండా యాక్షన్ స్కోప్‌ ఉన్న చిత్రాల్లో నటించేందుకు సైతం ఆసక్తి చూపుతోంది రష్మిక మందన. తన గ్లామర్‌ని కాపాడుకోవడంతో పాటు బ్రాండెడ్‌ హ్యాండ్‌ బ్యాగ్‌లు, ఫేమస్ డిజైనర్‌ డ్రెస్సులతో కుర్రకారు మతిపోగొడుతోంది. ఇక సోషల్ మీడియాలో కూడా అత్యధికంగా ఫాలోవర్స్‌ని కలిగి ఉన్న రష్మిక..తన కొంటె చూపులతో అటు ఆడియన్స్‌ని, ఇటు ఫిల్మ్‌ ఇండస్ట్రీని తన చుట్టూ తిప్పుకోవడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.

Published by:Siva Nanduri
First published:

Tags: Pushpa, Rashmika mandana

ఉత్తమ కథలు